శాస్త్రవేత్తలు జవాబు చెప్పలేకపోతున్న 5 మిస్టీరియస్ డిస్కవరీస్ -Telugu Facts

 

సాదారణంగా మనుషులు అందరికీ కూడా మిస్టరిస్స్ అంటే చాలా ఇష్టం శాస్త్రవేత్తలకైతే ఈ మిస్టరిస్ని అంటే మరింత ఇష్టం . ఏదైనా ఒక కొత్త వస్తువు కనపడిన ఏదైనా విషయం తెలిసినా కూడా దాని గురించి పూర్తిగా పరిశోదించాలనుకుంటారు. ఒకవేళ అది మిస్టరీగా అనిపించినట్లయితే దాని గురించి మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఒక వస్తువుకు సంబందించి పూర్తి వివరాలు తెలుసుకుంటారొ అప్పుడే వాళ్ళు అసలైన శాస్త్రవేత్తలు అనే ఫీలింగ్ వాళ్ళకు కలుగుతుంది. అందుకే వాళ్ళకు ఒక వస్తువుగాని దొరికినట్లైతే దాన్ని లోతుగా పరిశీలిస్తారు. మనకు కూడా ఈ భూమిమీద ఎన్నో వస్తువులు కనిపిస్తుంటాయి అయితే శాస్త్రవేత్తలు ఎంత కష్టపడి  ఎంత పరిశోదించినా కూడా అవి ఎందుకు అక్కడున్నాయి ఎలా ఏర్పడ్డాయి అనే విషయాలన్నీ కూడా అసలు అర్ధం కాకుండా ఉంటాయి. అలాగా శాస్త్రవేత్తలకే అంతుచిక్కని కొన్ని నమ్మశక్యం కానీ ఆవిష్కరణలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుంధాం.

 

1.బ్రిగేడూన్

mystery discoveries
Brigadoon stone

   ఈ బ్రిగేడూన్ అనేది స్కోటిష్ హైలాండ్ లో ఉన్న ఒక పల్లెటూరు. ఒకప్పుడు దీని గురుంచి చాలామంది చాలా కథలుగా చెప్పుకున్నారు మరియు ఈ ఊరు రష్యా లోని ఒక ఊరులాగే ఉంటుందని చాలామంది అభిప్రాయం.  ఈ ఊరుల గురించి చరిత్రలో ఎన్నోరకాలుగా చెప్పబడింది కానీ అది నిజంగా ఉంది అనడానికి దానికి సంబందించిన ఒక సాక్ష్యం కూడా దొరకలేదు. అయితే 1792సం లో ఒక రాయి దొరికింది ఆ రాయి పేరు తుతోమరోకాన్. ఈ రాయి అనేది ఫణగోరియ అనే ఒక ప్రాంతం ధగ్గర దొరికింది. ఈ రాయిని చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రస్తుతానికైతే ఇది సెయింట్ పీటర్బర్గ్ లోని స్టేట్ హెర్మిటేజ్ మ్యూజియంలో ఉంది అయితే ఈ రాయి మీద కొన్ని అక్షరాలు కొన్ని కొలతలు ఏవేవో రాసి ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం దీనిమీద రాసినవన్నీ  తుతోమరోకాన్ నుంచి క్రిచ్ కి  ఎంత దూరం ఉంటుందని అది అక్కడ రాసివుంటుంది అని అంటుంటారు. అంతే కాకుండా ఆ దూరంని 1060సం లో ఒక రాజు కొలిచాడని ఆ దూరంనే అతను ఆ రాయిమీద చెక్కించాడని అంటారు. ఈ రాయిని చెక్కడానికి కారణం ఏంటంటే క్రిచ్యొక్క కొలతలు కొలవడానికి అని మరియు క్రిచ్ లో ఉన్న ప్రాంతాలు కావచ్చు నదులు కావచ్చు ఇవన్నీ కూడా కొలవాలనే ఉద్ధేశంతోనే ఈ రాయిని ఇలా చెక్కించి ఉండవచ్చు అని నమ్ముతుంటారు. ఈ రాయి మీద సుమారుగా 18 1/2 మైళ్ళుకు సంబందించిన సమాచారం మొత్తం ఈ రాయిమీద ఉంటుంది మరియు ఈ రాయి గురించి కొంచం లోతుగా తెలుసుకున్న తరువాత కంతమంది శాస్త్రవేత్తలు ఏమని నమ్మడం మొదలుపెట్టారంటే యూరోప్ మరియు రష్యా చరిత్రలో మొట్టమొదటి ఎపిక్ గ్రాఫిక్ రాయి ఇదే అని నమ్ముతారు. అయితే కొంతమంది ఆ వాదనతో ఏకీవబించట్లేదు ఎందుకంటే కొన్ని వేరువేరు రాయిలనేవి ఇలాంటి రాతలను కలిగి ఉనాయి కనుక ఇది అంత పూర్వం అయినది కాదు అని అంటున్నారు. మరికొంత మంది ఏమని చెప్తున్నారంటే దీన్ని 18శతాబ్దంలో తయారు చేశారని 10వ శతాబ్దంలో కాదని ఇది కొంచెం ముందుగా అయిన చెక్కి ఉండచ్చు కాకపోవచ్చు కానీ మరిఅంతా పురాతనం అయినది అయితే కాదు అని చెపుతునారు. మరి ఇంకొకటి ఏంటంటే 11వ శతాబ్దంలో రష్యాలో ఉన్న సిటీస్ కావచ్చు రష్యాలో ఉన్న వేరువేరు ప్రాంతాలు కావచ్చు అన్నీ కూడా చెక్కతోనే నిర్మించబడ్డాయి అవి అన్నీ కూడా మంటల కారణంగా కాలిపోయాయి వాటికి సంబందించిన చారిత్రాపాక గ్రంధాలు కూడా ఆ ఇళ్లలోనే కాలిపోయాయి లేదంటే మనకు ఇప్పుడు ఆ రాయి 11వ శతాబ్దందా 10వ శతాబ్దందా లేదా 18వ శతాబ్దందా అని తెలిసిపోయేది.  

 

2. హంగర్ స్టోన్స్

mystery discoveries
Hungry stones

   కరువు అనేది ఎప్పుడు కూడా మంచి విషయమేమి కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కరువనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కరువు కారణంగా నీళ్ళు అనేవి పూర్తిగా ఎండిపోయి ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఉన్న సిటీస్ కానీ దేశాల అవశేషాలు బయటపడుతున్నాయి. మనకు చెరిత్ర గురించి ఎన్నో గొప్ప విషయాలు తెలియచేస్తునాయి. పురాతన కాలంలో కరువనేది చాలా సులబంగా వచ్చేది అంతే కాకుండా ఆ కరువు ఒక నగరాని ఒక దేశాని సమూలంగా తుడిచిపెట్టేసేది ఇంకా కాకుండా ఒక నాగరికతని నాశనం చేసెసేది. మనకి అక్కడ కొన్ని రాయిలు కనిపిస్తాయి వాటిని హంగర్ స్టోన్స్ అని అంటారు. ఈ రాయిలు మనకు రివర్ ఎల్బా అనే నది ఒడ్డున కనిపించాయి. ఈ ఎల్బా నది జెచియా అనే నగరం దగ్గర ఉంటుంది అయితే ఆ రాయిలో ఒకటి చాలా పెద్దగా కనిపిస్తుంటుంది అది జెచియా కాపిటల్ అయిన ప్రేగ్యూ దగ్గర కనిపించింది. ఇది మనకు ఎలా కనిపించిందో తెలుసా 2018లో ఈ ప్రాంతంలో విపరీతమైన కరువనేది వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న నీరు మొత్తం ఎండిపోయాయి.  అప్పుడే మనకు ఈ బారి రాళ్ళు అనేవి కనిపించాయి అయితే అన్నీ రాళ్ళ లోకి ఈ రాయి అనేది చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఈ బారి రాయి మీద ఏదో ఒక వింతైన బాషలో రాసుంది అక్కడ ఏంరాసింది అని ఎవరికి కూడా అర్ధం కావడంలేదు కానీ కొన్ని పదాలను డికోడ్ చేస్తే ఏమని వచ్చిందంటే ఒకవేళ మిరుకనుక దీన్ని చదువుతుంటే "ఎడవండి" అని రాసుంది. దాన్ని చూసిన తరువాత కొంతమంది ఏమని చెప్పరంటే దీన్ని 1904సం లో ఫ్రాన్స్ మేయర్ అనే ఒక వ్యక్తి ఆ నగరంలోని నీళ్ళు చాలా ప్రమాధకారంగా మారిన తరువాత ఆ నగరం అనేది పూర్తిగా ప్రమాధకారంగా ఉందని అర్ధంచేసుకొని ఆ నగరంలో ఉన్న ప్రజలు నీళ్ళు లేక చనిపోయే స్థితికి వచ్చారని అర్ధం చేసుకొని ఆ నగరం గురించి ప్రపంచానికి తెలియాలి అనే ఉద్ధేశంతొ ఇలాగ ఆ రాయిమీద రాసుంటాడని చాలామంది అంటుంటారు. అందుకనే వీటిని హంగర్ స్టోన్స్ అని అంటుంటారు దాని అర్ధం ఏమిటంటే ఆకలితో ఉన్న రాయిలు అంటే ఒక్కప్పటి కాలంలో ఉన్న ప్రజలు కరువు కరనంగా ఆకలితో బాధపడి చనిపోయారని దాని కారణంగ వాళ్ళకి గుర్తుగా ఈ రాళ్ళను ఏర్పాటు చేసివుంటారని చెప్తున్నారు . మరి కొంతమంది ఏమంటునారంటే ఈ రాళ్లలో అత్యంత పురాతనమైన రాయి 1417సం నాటిదని అప్పట్లో యూరోప్ లాండ్ మార్కలా కూడా ఈ హంగర్ స్టోన్స్ ని ఏర్పాటు చేసుండచ్చు అని అంటుంటారు. ఒకక్కరు ఒక్కొక్క విధంగా చెప్పినప్పటికి కూడా అసలు వీటిని ఇలా చెక్కింది ఎవరని ఇంకా మిస్టరీగానె మిగిలిపోయింది.

 

3.ఫీల్డ్స్ ఒఫ్ ఇంగ్లాండ్

mystery discoveries
Fields of England

   ఇంగ్లాండ్ లోని పంటపొలాలలో కొన్ని వూహించని గడ్డలు అలాగే అంతుచిక్కని మౌంట్స్ ఎన్నో సంవత్సరాలుగా పురావస్తు శాస్త్రవేత్తలని మరియు హిస్టోరియన్లను ఇబంధిపెడుతువున్నాయి. మొదట వీటిని చూసి అంధరు ఏమనుకునారంటే ఇవేవో శ్మశాన వాటికలు అని ఆముకునరు. పూర్వంలో ఇక్కడ అంతక్రియలు జరిగేవి వాళ్ళకి గుర్తుగా ఈ సమాధులు చేసిండచ్చు అని అనుకున్నారు. కానీ వీటిమీద మరింత లోతుగా పరిశీలించిన తరువాత తెలిసిన విషయం ఏమిటంటే అవి సమాధులు కావని అవి  రాబిట్ బ్రీడెర్స్ అని తెలిసింది అంటే మధ్యయుగం టైములో కుందెలను పెంచడానికి కొన్ని గోతులను తవ్వేవారని ఆ తరువాత అవి బయటికి పారిపోకుండా చుట్టూ రక్షణవంటిధాన్ని ఏర్పాటుచేయడం కోసం ఇటువంటి వింతైన నిర్మాణాలను చేపట్టేవారని తెలిసింది మరియు కొన్ని ప్రాంతాలలో కుందెలకు  సంబందించిన కళేబరాలు కనపడ్డాయి ఇంకొకటి ఏంటంటే అది ఒక పెద్ధ పంజరంలా ఉండదని అన్నీకూడా చిన్నచిన్న పంజరంలా ఉంటాయని దేనికి దానికి విడిగా పంజారాలు ఉంటాయి అని తరువాత తెలిసింది కాకపోతే అవన్నీ సొరంగాలులా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయివుంటాయి. అలా ఎందుకు కనెక్ట్ చేశారంటే వాటన్నిటికీ కూడా ఆహారం ఒకచోటే పెట్టేవారు అవ్వని ఒకచోటకి వచ్చి వాటి ఆహారాన్ని తీసికునేవి. ఈ ప్రాంతంలో పురాతనకాలంనాటి ఇల్లు, కొన్ని టవర్స్ కనిపిస్తుంటాయి. దానివల్ల ఎమౌతుందంటే దీనీ పక్కన మనుషులు నివసించేవారని  తెలుస్తుంది. అక్కడ నివసించేవారందరూ కుందెలకు కాపలాదారులు అయుండచ్చని అనుకుంటున్నారు. అంటే ఈ కుందెలకు ఆహారం పెట్టేవారు వాటికి బాలేకుండా వస్తే వాటిని చూసుకునే వాళ్ళుకూడా దీని చుట్టుపక్కన నివశిస్తుండచ్చు. ఇప్పుడు అయితే కుందెలకు విలువ ఇవ్వట్లేదు పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఒకప్పటి కాలంలో అంటే 11 లేదా 12వ శతాబ్దంలో కుందెలు మాంసాని చాలా ఇష్టంగా తినేవారు అంతే కాకుండా కుందెలు చర్మంతో కొన్ని చిన్న చిన్న బొమ్మలు చేసేవారు అందువల్ల ఆ కాలంలో కుందేలుకి చాలా డిమాండ్ వుండేది.   

 

4. ది మమ్మీ

mystery discoveries
mummy coffin

   శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అద్బుతమైన ఆవిష్కరణించారు అది ఎప్పుడంటే ఏప్రిల్ 2020లో లాక్ డౌన్ మొదలైన తరువాతే ఈ అద్బుతాని కనుగొన్నారు. ఇంతకీ ఆ అద్బుతమైన ఆవిష్కరణ ఏంటంటే 3000సం కృతంనాటి ఒక శవపేటిక ఇది వాళ్ళకి ఈజిప్ట్ లో దొరికింది. సాధరణంగా ఈజిప్ట్ లో ఉండే శవపేటికలన్నిటికి కూడా బయట రకరకాల రంగులు వెస్సుండడం చూస్తుంటాము రకరకాలుగా చేసి అమ్ముతుంటారు ఎందుకంటే ఆ రాజులకి కావచ్చు లేదా సమదులలో ఉన్నవారికి కావచ్చు గౌరవం ఇవడంకోసం ఇటువంటి రంగులు వేస్తుంటారు మరియు ఇంకొకటి ఏంటంటే ఆ సమాదులలో ఉన్న వ్యక్తి ఆదారంగా బయట రంగులేస్తుంటారు అంతే కాకుండా ఆ వ్యక్తి ఏ వ్యాదితో మరణించాడనిబట్టి కూడా బయట రంగులు మారుతుంటాయి. ఏ శవపేటికకు కూడా లోపల రంగులనేవి కనపడలేదు కానీ వాళ్ళకు కనపడిన పేటికలో మాత్రం లోపలకూడ కొన్ని రంగులనేవి కనిపించాయి. అసలు ఆ రంగులకి అర్దం అనేది ఎవరికి కూడా అర్దంకావడంలేదు మరియు ఆ రంగులని లోపలున్న మమ్మీని చూసి బహుశా ఆ మమ్మీ ఒకప్పటి రాణిది కానీ లేదా ప్రీస్ట్ అయిండచ్చుఅని అనుకుంటున్నారు. ప్రీస్ట్ అంటే పూర్వం ప్రీస్ట్స్ ఉండేవారుగా వాళ్ళ బార్యలు.  అయితే ఇవిమాత్రమే కాదు కొంతమంది ఇలాగే రాణి లేదా ప్రీస్ట్ యొక్క శవపేటికలు కనపడ్డాయి కానీ వాళ్లెవరికి కూడా లోపలున్న రంగులేవీ కనపడలేదు అదే ఈమె విషయంలో చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఈ రంగులని చూసి బహుశా ఈమె "లేడి ఒఫ్ ద వెస్ట్" అని అంటున్నారు. తరువాత ఆ మమ్మీని పెర్త్ మ్యూజియంకి ఇచ్చేశారు. అప్పటినుండి ఇప్పటివరకైతే అది అక్కడే ఉంది దాని మీద ఇప్పటికీ పరిశోదనలు చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఆ రంగులకి అర్ధం ఏమిటో తెలియట్లేదు. బహుశా చనిపోయిన తరువాత లైఫ్ గురించి అంటే చనిపోయిన తరువాత ఆ రంగులలో ఉండి ఉండచ్చు అని చెప్తున్నారు.

 

5. గ్రేట్ వాల్ ఒఫ్ పెరు

mystery discoveries
Historical walls

   వాస్తవానికి ఈ అద్బుతమైన వస్తువుని కనుగొనడానికి శాస్త్రవేత్తలకి 3800సం లు పట్టింది. ఇది మనకు పెరులో దొరికింది ఇది అత్యంత వింతైన వాల్ అని చెప్పాలి. బహుశా దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మరొక 3800సం లు పట్టచు అని అంటున్నారు.  ఒక్కప్పుడు ఈ ప్రాంతంలో ఆచారబద్ధమైన బవనం ఉండేది ఆచారబద్ధమైన బావనంయొక్క క్రింద బాగంలో నేలలోపల బాగాలోతులో ఈ అధ్బుతమైన గోడ కనిపించింది. ఈ పురాతత్వ సైట్ పేరు వికామ ఇది మనకు పెరు రాజదాని అయిన లిమాకి ఉత్తరభాగంలో ఉంటుంది. ఆగష్టు 2019న శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో కొన్ని తవ్వకాలు చేస్తున్న సమయంలో వారికి ఈ అద్బుతమైన గోడ అనేది కనిపించింది. ఈ గోడమీద మనం చూసినట్లైతే మనుషుల మొకాలు అని బాగా తెలుస్తుంది. అలాగే ఈ ప్రాంతాలలో ఒక కప్ప యొక్క ముఖం కూడా చాలపెద్దగా కనిపిస్తుంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కప్పలు మొకాలు ఈ ప్రాంతంలో ఎందుకున్నాయంటే ఒకప్పుడు పూర్వీకులు ఏమని నమ్మేవారంటే కప్పలకు గనుక పెళ్లిలు చేసినట్లైతే  వర్షాలు పడుతాయి అని నమ్మేవారు ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ఇది నముతున్నారు. బహుశా ఈ ప్రాంతంలో వర్షం పడటంకోసమని ఇలాగ కప్ప మొకాన్ని చెక్కి ఆ గోడలోపల పెట్టుండచ్చు అని అంటున్నారు లేదా ఆ కప్పల కారణంగ లేదా వేరే కారణంగ కావచ్చు లేదా వర్షం పడిన తరువాత ఆనందంతో కప్ప ఆకృతిని ఆ గోడలో పెట్టిండచ్చు అని అంటున్నారు. అలాగే మానవరూపం ఉన్న గోడకు దగ్గరలో మరొక పెద్ద గోడ కూడా ఉంది దాని పైన కూడా నాలుగు మొకాలు కనిపిస్తుంటాయి అంతే కాకుండా ఆ మొకాలు చుట్టూ పాములు కనిపిస్తుంటాయి. మరొక చోట మనకి వింత ఆకృతులు కనిపిస్తుంటాయి. శాస్త్రవేత్తలకి వీటి వెనకున్న అసలైన అర్ధం ఇప్పటికీ కూడా అర్ధంకావడం లేదు. కొంతమంది ఏమని అంటున్నారంటే ఆ ఆకృతిని ఎధైన కరువు వచ్చినప్పుడు చెక్కి ఉండచ్చని అంటున్నారు లేదంటే ఏదైనా పండగకి గుర్తుగా దీనిని చేక్కుండచని కూడా చెప్తున్నారు. ఒక్కప్పటి కాలంనాటి దేవుళ్ళని ప్రతినిధ్యం చేస్తు వీటినిలాగా చెక్కి ఉండచ్చు అని చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో మత్స్యకారుల సంఘం వ్యవసాయ సంఘం వారు ఈ ప్రాంతంలో ఎక్కువుగా నివసించేవారని వాళ్ళకి ఎటువంటి ప్రమాధాలు జరగకూడదని దిష్టి తగలకుండా వీటిని చెక్కి ఉండచ్చు అని అంటున్నారు. ఏది నిజం అనేది అయితే ఇప్పటికీ కూడా తెలియట్లేదు. 

 

       

   

     

Post a Comment

0 Comments