మీ మనస్తత్వాన్ని గుర్తించే 8 Optical Illusion -Telugu Facts

 

ఆప్టికల్ ఇల్ల్యుషన్స్(దృష్టిభ్రాంతి) దీని గిరించి మనందరికీ తెలిసిందే. సాదారణంగా ఆప్టికల్ ఇల్ల్యుషన్స్ అంటేనే  రెండు వేరువేరు ఫోటోస్న్ ని ఒకే చోట చూపిస్తుంటారు. మనం ఆ ఫోటోని ఒకలా చూస్తే ఒకలా కనిపిస్తుంది మరోలా చూస్తే మరోలా కనిపిస్తుంది అయితే ఈ  ఆప్టికల్ ఇల్ల్యుషన్స్ ని మనం ఏ కోణంలో చూస్తునమనిబట్టి కూడా మన యొక్క వ్యక్తిత్వం తెలుస్తుందని కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. నేను మీకు ఇప్పుడు కొన్ని ఆప్టికల్ ఇల్ల్యుషన్స్ చూపిస్తాను మీరు దాన్ని చూసిన తరువాత మీయొక్క వ్యక్తిత్వం ఏంటనేది నేను చెప్తాను.

 

   1)

horse and frog
1) Illusion

ఇది మొదటి ఆప్టికల్ ఇల్ల్యుషన్ దీన్ని ఒక ఐదు సెకండ్లు చూడండి, మీరు దీన్ని మొదటిసారి చూడగానే ఎంకనిపించింది. మీకు కప్ప గనుక కనిపించింది అనుకోండి మీరు చాలా సూటిగా ఉండే వ్యక్తిత్వం మీరు చాలా నిజాయితిగా ఉంటారు అంతే కాకుండా ఏ విషయం అయిన కూడా సూటిగా సుత్తి లేకుండా చెప్పేయడానికే ఇష్టపడుతారు మరియు మీరు నమ్మకంగా ఉండే వ్యక్తి అంతే కాకుండా మీమల్ని నమ్మచ్చు కానీ కొన్నిసార్లు మీరు వేరేవాళ్ళ మీద కూడా ఆధారపడుతుంటారు. అంతేకాకుండా మీ మాటలో ఎటువంటి దాచిన సందేశాలు ఉండవు అన్నీ మాటలు ప్రత్యక్షంగా ఓపెన్ గా చెప్పేస్తుంటారు అంధువలన మీమల్ని చాలామంది నమ్ముతుంటారు. ఒకవేళ మీకు కప్ప కాకుండా గుర్రం యొక్క తల కనిపించినట్లైతే. మీకు ఇప్పటికీ గుర్రం తల కనిపించక పోతే ఒక సారి ఈ ఫోటోని ఎడమ పక్కకి వంగి చూడండి మీకే తెలుస్తుంది. చూశారుగా ఇది గుర్రం యొక్క తల గుర్రం యొక్క తల మీకు కనిపించినట్లైతే మీరు చాలా ఆలోచన కలిగున్న వ్యక్తులు అని అర్ధం అంతే కాకుండా మీ మెదడు చాలా విశ్లేషణాత్మక మెదడు. అంటే దేన్నైనా సరే విశ్లేశించి దేన్నైనా సరే మంచి అవగాహన వచ్చిన తరువాత మాత్రమే దాని గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. దీని కారణంగా మీ జీవితంలో మీరు ప్రతిచోట విజయాన్ని ఎదురవుతుంటుంది.  

 

2) 

cat and mouse
2) Illusion

ఒకసారి ఈ ఫోటోని చూడండి, మీకు ఈ ఫోటోలో ఎలుక గనక కనిపిస్తునట్లైతే మీరుఒక ఆశావాద వ్యక్తి అని చెప్పాలి ఎందుకంటే మీరు ప్రతివిషయంలో కూడా మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారు అని కూడా ఇది మనకు తెలియచేస్తుంది. అంతే కాకుండ మీరు ఎలాంటి వ్యక్తి అంటే ఒక రూపాయి కాయిన్ మీకు ఇచ్చారు అనుకుందాం. ఆ కాయిన్ ని ముందు వైపు లేదా వెనక వైపు ఎంచుకున్నా ఒకటే అని అనుకుంటారు కానీ మీరు అలా కాదు వెనకపైపు ఎంచుకుంటే కేవలం దేశం బొమ్మ కనిపిస్తుంది ఏ సంవత్స్రంలో ముద్రించారో తెలుస్తుంది ఇంకా ఉంటే ఎవరైనానాయకుల ఫోటో కనిపిస్తుంది. కానీ ముందు వైపు ఎంచుకుంటే రూపాయి యొక్క చిహ్నం ముద్రించింది అది మాత్రమే విలువ కలిగుంటుంది కనుక మనం దాన్నే ఎంచుకుందాం అనే భావంలో ఉంటారు మీరు. చాలా సమయాలలో అన్నీ మీకే అనుకూలంగా ఉండాలని అనుకుంటారు. ఒకవేళ అలాకాకుండా మీకు పిల్లి కనిపించినట్లైతే మీరు చాలా రియలేస్టిక్ పర్సన్ అని అర్ధం మీరు ప్రతి దాంట్లో కూడా మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పుడు మాత్రమే దాని మీద ఒక అవగాహానకి వస్తారు. అలా చేయడం ద్వారా మీ జీవితంలో నష్టాలు అనేవి చాలా తక్కువుగా వస్తావుంటాయి ఏ పని చేసిన లాబాలు అనేవి ఎక్కువుగా వస్తావుంటాయి.

 

3)

skeleton and girl
3) Illusion

 

ఒకసారి పై ఫోటోని చూడండి, ఈ ఫోటో చూసిన వెంటనే ఒక మహిళ కిటికీలో నుంచి బయటికి చూస్తునట్లుగా మీకు కనిపించినట్లైతే దాని అర్ధం ఏమిటంటే మీ జీవితంలో చాలా ప్రమాధాలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మీరు మీ జీవితాన్ని కూడా ప్రమాదంలో పెడుతారని ఇది తెలియచేస్తుంది. మీకు ఆకస్మిక జీవనం అంటే చాలా ఇష్టం అంటే ఏమిటంటే అప్పటికప్పుడు అనుకోని చేసేయడం దాని కారణంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవడం ఉంటుంది. దాని కారణంగా మీరు అసహ్యకరమైన పరిణామాలు అనేవి మీ జీవితంలో మీకు ఎదురవుతుంటాయి. ఒకవేళ అలాకాకుండా మీకు ఒక పుర్రె కనిపించినట్లైతే. మీరుఒక రియలిస్టిక్ పర్సన్. చాలమందికి దీన్ని చూసినవెంటనే పుర్రెనే కనిపిస్తుంది. దాని అర్ధం ఏమిటంటే దేనిగురించి మనం ఎక్కువుగా ఆలోచించం మనకి ఏమి అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్లిపోతుంటాం. మనం చేసే పనులు ఏదో ఒకరోజు మంచి చేస్తుంది అనుకోని ముందుకు సాగుతుంటాం ఎవ్వరేమన్నా పట్టించుకోము ఎవరేమన్నా కూడా నేను లెక్కచేయను అనుకోని వెళ్లిపోతుంటాం అని ఇది మనకు చూపిస్తుంది.

 

4)

saxophone and women
4) Illusion

ఒకసారి ఈ ఫోటోని చూడండి, ఈ ఫోటో చూసిన వెంటనే ఒక వ్యక్తి సాక్సోఫోన్ వాయిస్తూనట్లుగా మీకు కనిపిస్తునట్లైతే మీరు లెఫ్ట్ బ్రైనేడ్ పర్సన్ అంటే ఏంటంటే మీ శరీరంలో లెఫ్ట్ సైడ్ ఉన్న మెదడు బాగా డెవలప్ అయింది. మీకు విశ్లేసనాత్మక ఆలోచన అనేది చాలా ఎక్కువ మీకు అంకెలు,బాషల మీద పట్టుకూడా చాలా ఎక్కువుగా ఉంటుంది మరియు మీ స్నేహితులకు ఏమైనా సమస్యలు వచ్చినట్లైతే దానికి పరిష్కారం కోసం మీ ధగ్గరకే వస్తుంటారు. ఒకవేళ సాక్సోఫోన్ వాయిస్తున్నా వ్యక్తి కాకుండ ఒక మహిళ యొక్క  ముఖం మీకు కనిపిస్తునట్లైతే దాని అర్ధం రైట్ బ్రైన్ వ్యక్తులు అంటే మీ శరీరంలో ఉన్న కుడి అర్ధగోళం బాగా పనిచేస్తుందని అర్ధం. అంటే మీకు క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువ అంతే కాకుండ మీరు మీలో ఉన్న కళని చూపించుకోడానికి వేరువేరు విదానాలు వాడుతుంటారు కొన్నిసార్లు హావభావాల తెలివి వాడుతుంటారు. మీరు చాలా తెలివైన మనుషులు మీ ఊహలు అయితే ఊహకి అందనివిదంగా ఉంటాయి.

 

5) 

bears and mountains
5) Illusion

ఒకసారి ఈ ఫోటోని చూడండి, ఈ ఫోటోని మొదటి సారి చూసినప్పుడు వెంటనే ఎంకనిపించింది. ఒకవేళ మీకు మూడు ఎలుగుబంట్లు కనిపించినటైతే మీ మెదడు విశ్లేషణాత్మక విదానంలో ఆలోచిస్తుందని అర్దం మరియు మీరు చాలాతెలివిగా ఏ పనినైనా సరే ఆలోచించి చేస్తారని ఇది తెలియచేస్తుంటుంది.అంతే కాకుండ మీకు ఎధైన ఒక సమస్య కానీ వచ్చినటైతే దాన్ని మీరు భాగాలుగా విడతీయడానికి ఆతృత చూపిస్తారు అంటే సమస్య ఏంటి దీన్ని ఎక్కడ పరిష్కరించవచ్చు ఇలాంటి విశ్లేషణ కలిగి ఉంటారు మీరు. ఒకవేళ మీకు కొండలు కనిపించినట్లైతే మీరు చాలా ఓపెన్ గా ఉంటారు. అంతేకాకుండా మీకు గుండె దైర్యం అనేది చాలా ఎక్కువ మీరు మానసికంగా బాదపడటం ఇలాంటివి చాలా తక్కువ మీకు ఏదైనా సమస్య వచ్చినా కూడా దానిని వెంటనే పరిష్కరించటానికి ప్రయత్నిస్తారు ఆ పరిష్కారం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే మీరు మీ వషయాలలోనే కాకుండ పక్కవారి విషయంలో కూడా ఎక్కువుగా తలదూరుస్తారు వల్ల యొక్క సమస్యలకి కూడా పరిష్కారం చెప్పటానికి ప్రయత్నిస్తారు దీని కారణంగా మీకు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి కానీ మీరు వాటి గురించి పెద్దగా పట్టించుకోరు.

 

6)

squirells
6) Illusion

ఒకసారి ఈ ఫోటోని చూడండి, మీకు దీన్ని చూసినవెంటనే చెట్టు మీద ఉన్న రెండు ఉడుతలు కనిపించినట్లైతే దాని అర్ధం ఏంటంటే మీకు ఏదైనా ఒక సమస్య ఎదురైనట్లైతే దానికి పరిష్కారం వెతకగలిగే సత్త మిలొ ఉన్నాదని అర్ధం. అంతే కాకుండా మీరు నమస్యలని బాగా అర్ధం చేసుకోగలరని ఇది చెప్తుంది. ఒకవేళ మీకు రెండు ఉడతలు కాకుండా ఒక మహిళ ముఖం కనిపించినట్లైతే, మీకు మహిళ ముఖం ఇంకా కనిపించలేద అయితే బాగా గమనించండి ఈ రెండో ఉడుత మహిళ యొక్క పెధాలు, మొదటి ఉడుత మహిళ యొక్క మొదటి కన్ను చెట్లువచ్చి మహిళ యొక్క రెండో కన్ను అర్ధమైందిగా మహిళ యొక్క ముఖం కూడావుంది ఇందులో. ఒకవేళ మహిళ యొక్క ముఖం మీరు ముందు చూసినట్లైతే మీరు ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పాలి. మీకు పరిశీలన నైపుణ్యాలు చాలా ఎక్కువని చెప్పాలి. అంతేకాకుండా మీకు మిగతవాళ్ళతో మాటలు ఎక్కువుగా ఉంటాయి మరియు సామాజిక మతలుకూడ ఎక్కువుంటాయని అర్ధం.

 

7)

flowers and women
7) Illusion

ఇప్పుడు ఈ ఫోటోని ఒకసారి గమనించండి, ఈ ఫోటోలో మీకు ఒక అమ్మాయి ఒక ముఖం మొదట కనిపించినటైతే మీరు మీ చుట్టుపక్కల జరుగుతున్నా వాటిమీద చాలా అవగాహన కలిగున్నారని చాలా విశ్లేషణతో కలిగుంటారనికూడా ఇది తెలియచేస్తుంది. అంతేకాకుండా మీరు సరైన ముగింపుకి వస్తారు ఎలాంటి పరిస్తితిలో ఉన్నసరే ఏదైనా సమస్య వచ్చినట్లైతే దానికి పరిష్కారంకూడా చాలా పర్ఫెక్ట్ గా ఇస్తుంటారు మీరు అందులో ఎటువంటి అనుమానం లేదు. అలా కాకుండా మీకు మొదట పువ్వులు మాత్రమే కనిపిస్తునట్లైతే దానికి మీరు ప్రకృతిని బాగా ఇష్టపడే మనుషులని అర్ధం కాకపోతే మీలో లోతు విశ్లేషణ చేసే జ్ఞానం లేదని అర్ధం దానికి వేరే కారణాలుకూడ వుండివుండచ్చు ఎందుకంటే మీయోక్క నిత్యజీవితంలో చాలా ఉద్రిక్తతలు రకరకాల సమస్యలు ఉండివుండచ్చు దాని కారణంగకూడా దీనిని మీరు గుర్తించక పోయిండచ్చు.

 

8)

man car and LetterA
8) Illusion

ఇప్పుడు ఈ ఫోటోని చూడండి,   ఈ ఫోటోని చూసినవెంటనే మీకు ఏం కనిపించింది. ఒక వ్యక్తి బైనాక్యులర్స్ పట్టుకొని చూస్తునట్లుగా అనిపిస్తే మీరు ఏదైనా ఒక సంగటన మీద ఎక్కువుగా దృస్టీ పెట్టడం మీకు ఇష్టం ఉండదని అర్ధం. ఎందుకంటే మీకు ఇక్కడ అదొక్కటే కాకుండా మరొక్కటికూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు కారు చాలా స్పష్టంగా కనిపిస్తునట్లైతే మీరు మీతోటి కార్మికులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారని అర్ధం అంతే కాకుండా ఎక్కడ ఏమి జరిగినకూడ మీరు వాటిని చాలా బాగా గమనిస్తారని అర్దం. ఇంకొక్కటిఏమిటంటే మీకు ప్రణాళిక అంటే చాలా ఇష్టం మీరు ఏ పని  చేసినాకూడ మీరు ఒక ప్రణాళికతో పని చేస్తారు మరియు మీరు తొందరగా నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడరు చాలా నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ మీకు ఈ రెండు కాకుండా ఇంకొక్కటి కనిపిస్తే అదే ఆంగ్ల అక్షరం A ఒకవేళ ఈ "A" మీకు మొదట కనిపించింది అనుకోండి మీరు చాలా ప్రత్యేకమైన మనిషని చెప్పాలి మరియు మీ ఆలోచన విధానం అనేది ఎదుటి వాళ్ళకి అందనంత ఎత్తులో ఉందనిచెప్పాలి. మీ ఒక ఆలోచనలు కావచ్చు, మీ ఒక పరిష్కారాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయని మీయోక్క ఆలోచన విదానం తెలియచేస్తుంది.

Post a Comment

1 Comments