మన దేశంలో దెయ్యాలు తిరిగే 10 ప్రదేశాలు -Telugu Facts

 

మన లైఫ్ లో మనం ఎప్పుడో  ఒకప్పుడు పలనా చోట ఆత్మలు ఉన్నాయని అవి వారికి హాని చేసిన వారిని వెంబడిస్తునాయని లాంటి కథలను వింటూనేఉంటాం. అలాగే చాలా చోట్ల ఒక ఇల్లు లేదా ఒక  ప్రదేశం హంటింగ్ కి గురి అవడం ఆ ప్రదేశం కి కొత్తవారు రావడం అక్కడ ఉన్న ఆత్మలు వేదించడం లాంటి సన్నివేశాలని చాలా చోట్ల విన్నాం. మరి నిజంగా అలా హంటెడ్ కి గురి అయిన ప్రదేశాల గురించి మీకు తెలుసా. ఇవాళనం ఇండియా లోనే టాప్ హంటెడ్ ప్రదేశాల గురించి మనం తెలుసుకుందాం .

 

 

10.ఘోస్ట్ లేడి ఒఫ్ ఢిల్లీ కంటోన్మెంట్

Delhi cantonment road
డిల్లీ కంటోన్మెంట్ రోడ్ 

  పగటి పూట ఇది ఢిల్లీ లోనే చాలా అందమైన ప్రదేశాలలో ఒకటి కానీ రాత్రి అయేసరికి అది వేరే కథ. ఢిల్లీ కంటోన్మెంట్కి వెళ్ళే రహధారిలో ఒక ఆడ దెయ్యం తిరుగుతూఉంటుందని అంటారు తెల్లటి ధుస్తులు ధరించి అటు వైపుగా వెళ్ళే కార్లను ఆపడానికి చేతులు ఊపుతూ ఉంటుందని అంటారు ఆమెకి రైడ్ ఇవడానికి అంగీకరించని వారు మరలా కనిపించరని నమ్ముతారు ఢిల్లీ కొంటోన్మెంట్కి చేరుకునే వరకు కారు వేగానికి సరిపోయేలా ఆ మహిళ తమతోపాటు వస్తుంధని ఆపని వారు చెప్తుంటారు .

9. టెక్నో యునివర్సిటి క్యాంపస్ , అహ్మదాబాద్

Gujarat technological University campus
గుజరాత్ టెక్నో యునివర్సిటి క్యాంపస్

    వారి కొత్త క్యాంపస్‌తోపాటు ఆహ్వానించబడని అతిధి గా ఒక ఘోస్ట్ కూడా వచ్చిందని వారికి తెలియదు, ధీనిని నిజం అని చెప్పడానికి జి.టి.ఓ అధికారులకు మరియు కొంతమంది సిబంధికి ఎధురైన వింత సంఘటనలే సాక్షాలు కొంతమంది సెక్యూరిటిగార్డ్ల ప్రకారం భవనంయొక్క ఎవింగ్‌లో ఎధో ఒక ఘోస్ట్ ఉందని అధి అర్ధరాత్రి టేబల్ మరియు కూర్చిలను కొడుతు శబ్ధంచేస్తుందని వారు అక్కడికి వెళ్ళేసరికి శబ్దాలు ఆగిపోయి మరియు అలాంటి సంగటనే అక్కడ జరగనివిధంగా సాధారణంగా మారిపోతుంధాని అన్నారు, సెక్యూరిటి సుపెర్వైజర్ 8వ టిబింగ్ వద్ధ మూసివున్న ఒక రూమ్ తలుపు దానియంతటకి అధె తెరుచుకోవడం సీవింగ్ లో ఒక మహిళ ఏడవడం అతను విన్నాడఅం జరిగింది అన్నాడు. అకస్మాత్తుగా ఆ క్యాంపస్ కాళీ లిఫ్ట్ నాలుగు అంతస్తుల పైకివెలి వెంటనే కింధకి రావడం కూడా చూశాను అన్నాడు, ఆశలు నిజం కనిపెట్టడానికి అక్కడేవుండాలని నిర్ణయించుకున్న ఒక క్లర్క్ తరువాతి రోజు అక్కడే ఉన్న సీవింగ్ లో అపస్మాపాక స్థితులో పడివున్నాడు, లిఫ్ట్ లో ఎవరో స్త్రీ వారితో పాటు కనిపించకుండవుంటునట్లు అనుభవిస్తునట్లు కొంతమంది చెప్పారు, అలాగే ఒకరోజు సాయంత్రం 5గ లిఫ్ట్ ఎక్కిన ఒక స్టూడెంట్ అతని పక్కనే ఎవరో వున్న వింత అనుబుతి ఎధురైన మరుసటి రోజు నుండి మానసికరోగంతో మంచానపడ్డాడు, ఆరోజు నుండి ఈరోజు దాకా ఇలా వింతగా ఎందుకు జరుగుతునాయో తెలియకపోగ  దెయ్యామే  ఇలా చేసింధని అక్కడివారు నమ్ముతారు.

8. బాంగర్హ్ ఫోర్ట్, రాజస్తాన్

Bhangarh fort
బాంగర్హ్ ఫోర్ట్

 గంబీరమైన కోటకు నిలయం అయిన రాజస్తాన్ లో ఈ పాడుబడిన పట్టణం భారతదేశం లో అత్యంత హంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది బాంఘర్ ఫోర్ట్ సూర్యాస్తమయం నుండి సూర్యోధయం వరకు మూసివేయబడివుంటుంది, ఎందుకంటే ఆ సమయం లో కోట ప్రాంగణంలో అత్యదిక పేరాణోర్మల్ ఆక్టివిటీస్ జరుగుతాయి అంటారు. భంగర్హ్ గురించి ఒక కథ ప్రకారం తాంత్రికపూజరి రాజస్తాన్ ఆభరణం అనే రత్నావతి అనే యువరాణితో ప్రేమలో పడ్డాడు ఆ తాంత్రికపూజరి మంత్రవిద్యాతో ఆమెను వశపరుచుకోవడానికి ప్రణాళిక వేశాడు, అయితే ఆ విషయం గురించి యువరాణికి తెలియగానే ఆ మాంత్రికుడిని చంపమని అధెశించింది చనిపోయే ముంధు అతను ఈ పట్టణాని శపించాడు ఇప్పుడు ఈ పట్టణం నాశనం అయిపోయింది. మరియు ఎవరికి నివాసయోగ్యంఅయినది కాధు, అక్కడి దేవాలయాలు మరియు ఇళ్ల పైకప్పులు నిర్మించిన కొధిసేపటికే పడిపోతుంటాయి అని అక్కడి వారు చెపుతారూ , ఒకసారి రాత్రి పూట కోటలో ఉందామని దైర్యం చేసి వెళ్ళినవారు ఏవో అడుగుల శబ్దాలు వినట్లు మరియు ఒక మహిళా అరుస్తూ వినిపిస్తుందని అక్కడివారు చెప్పుకుంటారు.

7.కుల్ధార, రాజస్తాన్

Kuldhara Village
కుల్ధార విలేజ్
    రాజస్తాన్ యొక్క ఘోస్ట్ విలేజ్ అని పిలవపడే కుల్ధార భారతదేశం లో అత్యదిక హంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఈ గ్రామంలో వారు 84 ఇతర గ్రామం ప్రజలతో పాటు తమ ఇళ్లను వస్తువులను వదిలేసి రాత్రికిరాత్రే ఎక్కడికో వెళ్ళిపోయారు ఈ ప్రాంతానికి చెందిన దివాన్ సలుమ్ సింగ్ బారిగా పన్నులు వసూలు చేశారని అంధువల పల్లివాస్ గ్రామంలో జీవించటానికి చాలా కష్టం అయింది అని చెపుతారు, అలాగే అతను ఆ గ్రామంలో ఒక అమ్మాయి పై మనసుపడి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకొన్నాడని కానీ దానికి పలివాస్ నిరాకరించారని, అతను కోరుకునధి జరగకపోతే వారు బయంకరమైన పరిమాణాలు ఎధురుకోవాల్సి వస్తుందని గ్రామస్తులను బెధిరించాడని అంటారు. ఈ కారణం గా పలివాస్ మరియు ఇతర 84 గ్రామాల వాళ్ళు కలిసి వాళ్ళ గౌరవం కాపాడుకోవడానికి కుల్హ్ధార వదిలి వెళ్లిపోయారని అంటారు, వాళ్ళు వెళ్లిపోయే ముందు అక్కడ ఎవరు నివశించటానికి వీలు లేకుండా ఆ గ్రామంని శపించారు అంటారు మరియు ఈరోజు వరకు ఇక్కడ వదిలిన వస్తువలతో సహ పాడుబడిన ఇల్లు మాత్రమే కనిపిస్తాయి అంటారు.

6.రామోజీ ఫిల్మ్ సిటీ , హైదరాబాద్

Ramoji film city
రామోజీ ఫిల్మ్ సిటీ

  ఈ ఫిల్మ్ స్టూడియో నిజాముల పూర్వ యుద్ధభూమి లో నిర్మించబడింది, మరణించిన సైనికుల ఆత్మల్లు ఈ స్థలని కూడా వెంటాడతాయి అని నమ్ముతారు, గధులలో మిగిలిపోయిన ఆహారంకుడా గధి చుట్టూ చెళ్ళచెధురుగా వుంటుందని వింతవింత ఉర్ధు పదాలతో గోడల మిధా కనపడటం ఎవరు లేని బాత్రూమ్ తలుపులపై కొట్టడంవంటివి జరుగుతాయి అని చెపుతారు, విచిత్రం ఏమిటంటే దెయ్యాలు పురుషుల పై కంటే మహిళల పై ఎక్కువగా ధాడి చేస్తాయిఅంటారు, గధులోని ఆడవారి బట్టలు మాత్రమే చిరిగిపోయి కనిపిస్తాయి అని అంటారు,మీరు ఇక్కడికి వస్తే వినే అత్యంతప్రాచుర్యం పొంధిన కథ ఏంటంటే ఒక ఫిల్మ్ షూటింగ్లో ఎత్తైన చోట్ల నుండి స్పాట్ లైట్ చూసుకోలేక కార్మికులు హటాత్తుగా కింద పడిపోయారని వారిని ఎవరో బలవంతం గా నెట్టివేయబడ్డారు అని వారు చెప్పారు అని అంటారు.

5. కుందన్‌బాగ్ విత్చెస్ హౌస్, హైదరాబాద్

kundhanbagh
కుందన్‌బాగ్ విత్చెస్ హౌస్

  హైదరాబాద్‌లోని ఒకప్రత్యేకమైన ఇల్లు అక్కడ జరుగుతున అసాధారణమైన కార్యకలాపాల కారణంగా హంటెడ్ జాబితాలో చేరింది, ఈ ఇల్లు 2002 సంవత్సరం లో సంచలనం సృశ్టించింది ఇద్దరు అక్క చెల్లెలు వాళ్ళ తల్లి తండ్రులతో కుందన్‌బాగ్ లో నివశించేవారు, ఒక రోజు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళి మళ్ళీ తిరిగిరాలేదని అంటారు ఇంకా వాళ్ళ ముగ్గురు విచిత్రంగా ప్రవర్తిస్తూ వుండేవారని కుమార్తెలు ఎర్రటి నీళ్ళు వుండే బొట్టెల్తొ ఆడుకుంటూ అక్కడివారిని బయపెట్టేవారని అంటారు. ఇంట్లోనుంచి విచిత్రమైన శబ్దాలు ఏవో వస్తుంటాయిఅని అంటారు, ఇధిలావుండగా ఒక రోజు దొంగ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు మంచం మీద మూడు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇవటంతో పెద్ద వార్తగ మారింది కాని విచిత్రం ఏమిటంటే వాళ్ళు దొంగ వచ్చిన ముందురోజు కొవ్వొత్తిలు వెలిగించి ఇంటిచుట్టూ తిరగడం చూశామని వాళ్ళు ప్రతిరోజు నల్లదుస్తులు దరించి మంత్రాలు చదువుతూ వుండేవారని మరియు ఒకరోజు తల్లి ఒకని మీద గొడ్డలితో దాడిచేయడం చూశామని అక్కడివారు చెప్తుంటారు. మరో ఆచార్యకమైన విషయం ఏమిటంటే వారు ఆరు నెలల క్రితమే చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది మరి వాళ్ళు ఇనాళ్ళుగా చూసింది ఎవరినో ఇప్పటికీ పరిష్కారం కాని మిస్టరీ, ఇంకో విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆ ఇంటికి విధ్యుథ్ సరాపర కూడలేదు ఇప్పటికీ ఆ ఇంటికి లో మొదటి అంతస్తులో లైట్లు వెలుగుతూ దాదాపు ప్రతిరోజు కనిపిస్తాయని అంటారు, ఇప్పుడు ఆ ఇంటి లోపలికి ఎవరికి అనుమతిలేదు, చివరికి కుందన్‌బాగ్ మిస్టరీ ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది.

4.జీ.పీ బ్లాక్, మీరట్

G.P Block, Meerut
జీ.పీ బ్లాక్

  ఉత్తర్ ప్రదేశ్ లో ప్రముక నగరాలలో ఒకటి ఈ మీరట్ నగరం. మన దేశంలో అత్యంత పురాణ నగరాలలో ఒకటిగా పేర్కొంటారు. ఈ నగరాలలో జి.పి బ్లాక్ ఒకటి మోస్ట్ హంటెడ్ ప్రదేశంగా గుర్తిపుపోదింది. ఈ పురాతన బవంతిలో ఆత్మలు సంచరిస్తునట్లు అక్కడివారు చెపుతునారు. ఆ బవన్తివైపు వెళ్ళిన వారికి నలుగురు పురుషులు కొవొత్తిద్వీపం దగ్గర కూర్చొని మందు తాగుతునట్లు ఆ ఇంటిపైన ఒక అమ్మాయి ఎర్రటి వస్త్రాలతో కూర్చొని వునటువంటి దృశ్యాలు కనిపిస్తాయని అంటునారు. ఎవరైనా తెగించి ఆ బావన్తి లోపలికి వెళ్ళిన వారు తీవ్రంగ అస్వస్తతకుగురిఅయినట్లు స్థానికులు చెపుతునారు. ఈ కారనాలరీత్యా బవన్తి హంటెడ్ ప్రదేశంగా గుర్తిపు పొందింది.

3. షనివార్ వాడ ఫోర్ట్, పుణె

Shaniwar wada fort
షనివార్ వాడ ఫోర్ట్

  మహారాష్ట్ర లోని పెద్ద నగరాలలో పుణె పేరు ప్రత్యెకంగా చెప్పుకోవచ్చు. ఆనాటి మరాఠా రాజుల గుర్తులేన్నో ఈ నగరం లో కనిపిస్తాయి. అటువంటి వాటిలో ఒకటి షనివార్ వాడ కోట ఒకటి. అయితే ఈ పురాతన కోట మరాఠా చరిత్రకు చిహ్నంగానే  కాకుండా హంటెడ్ ప్రదేశంగా పేరు పొందింది.ఈ కోట హంటెడ్ ప్రదేశంగా మారడానికి చాలా చరిత్ర ఉందని అక్కడివారు చెప్తుంటారు. పూర్వం, ఈ కోటను పేష్వాశ్లు నిర్మించగా వారి వంశానికి చెందిన నానాసాహెబ్ పేష్వా తదంతరమ్ వాళ్ళ కుమారులు అయిన విశ్వాస్ రావు , మాధవ్ రావు ఈ ప్రాంతాని పాలించి వివిద యుద్ధాలలో చనిపోయారు. వారి మరణం తరువాత, నానాసాహెబ్ కుమారులలో ఆకరివాడైన నారాయణరావు పేష్వాగా ప్రకటించారు. అప్పటికి అతని వయసు 16సం మాత్రమే అయితే ఆ పదవిపై ఎప్పటినుంచో ఆశగావున్న నారాయణరావు పినతండ్రి అయిన రఘునాథ్ రావు కి ఇది నచ్చక నారాయణరావుతో విబేదించాడు. ఈ నేపద్యం లో రఘునాథ్ రావు ని బందించి చెరసాలలో పెట్టాడు. దానికి రఘునాథ్ రావు భార్య ఆనంది భాయి పగతో గ్గర్డి అనే అడవిజాతి కి డబ్బులు ఇచ్చి నారాయణ రావు ని హత్య చేయించింది. నారాయణ రావు గ్గర్ది తెగ వారు హత్య చేయడానికి వెంబడించినసమయంలో "కాకా మాలా వచ్వ " అని అరుస్తూ పరిగెట్టాడుఅంట. ఆ మాటకు అర్ధం "అంకుల్ నన్ను రక్షించండి" నారాయణరావు హత్య చేయబడిన కొన్ని సంవత్సరాల తరువాత ఇప్పటివరకు అతని ఆత్మ ప్రతిరోజు రాత్రి " కాకా మాలా వచ్వ " అంటూ ఆ కోట మొత్తం తిరుగుతుంటుందని చాలామంది చెప్పుతునారు మరి ముక్యంగా పున్నమి పౌర్ణమి రాత్రులలో ఈ కేకలు మరి ఎక్కువుగా వినిపిస్తాయని నారాయణరావు ఆత్మ కనిపిస్తుందని అక్కడ వుండేవారు చెప్తునరు.

2. లాంబి దేహార మైన్స్, ముస్సూరీ

Lambi dehar mines
లాంబి దేహార మైన్స్

  ఉత్తరాఖండ్ పేరు వింటేనే అందమైన ప్రదేశాలి, కొండలు కోనలు ఎన్నో గుర్తుకొస్తాయి. ఆ కొండల మద్య జరిగిన ఒక విషాదం నేటికీ అక్కడి ప్రజలను బయపెడుతుంది. డెహ్రాడూన్ జిల్లా లోని ముస్సూరీ అనే హిల్ స్టేషన్ ధగ్గరలో లాంబి దేహార అనే మైన్స్ ఉన్నాయి. ఆ ప్రదేశం నేడు ఆత్మలకు క్షుద్రపూజలు చేసేవారికి ప్రసిద్ధి చండడంతో ఆ మైన్స్ వైపు వెళ్లడానికి ఎవరు ధైర్యం చెయ్యరు. 1990 వరకు ఈ మైన్స్ లో సుమారు 50000 మంధి వరకు పనిచేయగా వారిలో చాలా మంది అంతుపట్టని రోగాలతో రక్తం కక్కుకొని చనిపోయారని అంతేకాకుండా అక్కడ సరైన ఇంజనీరింగ్ ప్లాన్ లేకపోవడం వల్ల ప్రమాదాలలో చాలామంది చనిపోయారు. ఈ కారణాలరీత్యా మైన్స్‌ని భారత ప్రబుత్వం మూసివేయగ ఆ ప్రదేశం లో చనిపోయిన వ్యక్తుల ఆత్మలు ఎక్కువుగా సంచరిస్తాయని దానికి తోడుగా మంత్రగాళ్ళు ఎక్కువుగా క్షుద్రపూజలు చేయడం వల్ల లాంబి దేహర్ మన భారతదేశంలో ఒన్ ఒఫ్ ద మోస్ట్ హంటెడ్ ప్రదేశంగా మారింది.

1. గ్రాండ్ పరాడి టవర్స్, ముంబై

Grand paradi towers
గ్రాండ్ పరాడి టవర్స్

  పెద్ధ పెద్ధ బవంతులకు నెలవైన ముంబై నగరంలో కూడా ఆత్మలు సంచరిస్తునాయనే పుకారులు కూడా ఎక్కువుగానే వినిపిస్తునాయీ. భారతదేశ వానిద్య రాజధానిగా పేరుపొందిన ముంబైలోని గ్రాండ్ పరాడి టవర్స్ హంటెడ్ ప్రదేశంగా పేరు సంపాదించింది. ఈ అప్పర్ట్మెంట్లో నివాసం ఉంటున్నవాసుదేవ్ దలాల్ మరియు తార దలాల్ అనే వృద్ధ దంపతులు కొడుకు కోడలి వలె తాము చనిపోతునామాని సూయిసైడ్ నోట్ రాసి చనిపోయారు. ఈ కేస్ కోర్టులో ఉండగానే ఆ దంపతుల కొడుకు కోడలు మరియు వాళ్ల 19సం కూతురు ఆ వృద్ధ దంపతుల లాగే దూకి చనిపోయారు. ఆ తరువాత ఈ టవర్స్ లో సుమారు ఇరవైమందికి పైగా సూయిసైడ్ మరియు ఆక్సిడెంట్శ్లాలో చనిపోయారు. ఇన్ని చావులకి కారణం ఆ వృద్ధ దంపతుల ఆత్మలే అని, వారి ఆత్మలు ఆ టవర్స్ పరిదిలో సంచరిస్తూనట్లు రాత్రివేళ్ళలో వాళ్ల అరుపులు వినిపిస్తునట్లు అక్కడుండే చాలామంది చెప్పారు.

Post a Comment

0 Comments