అసలు సముద్రమే లేని ఈ TOP 5 దేశాలు, యుద్ద నౌకలను ఎందుకు వినియోగిస్తున్నాయో తెలుసా? - Telugu Facts

     శతృదేశ సేనలు నుంచి రక్షించుకోవడానికి దాదాపు అన్నీ దేశాలు తమ సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటాయి ఈ సేనల్లో ఎన్నో విభాగాలు ఉండగా వాటిలో ఓ ముక్యమైన విభాగం నేవీ. ఈ ప్రపంచంలో సముద్ర తీర ప్రాంతాన్ని కలిగున్న ప్రతి దేశం తమ తమ సొంత నేవిలను నిర్వహిస్తుంటాయి. అయితే మన ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రం అసలు సముద్రతీర ప్రాంతలే లేకుండా ఉన్నాయి వాటినే ల్యాండ్ లాక్ దేశాలుగా నిపుణులు చెప్తుంటారు. సాధారణంగా ఈ దేశాలకు సముద్రతీరానికి ఏ మాత్రం సంబందం లేకపోవడం వల్ల ఆ దేశాల సైన్యంలో నేవీ విభాగంన్ని ప్రత్యేకంగా నిర్వహించుకొవ్లాసిన పనిలేదు కానీ కొన్ని ల్యాండ్ లాక్ దేశాలు మాత్రం నేటికీ సొంత నేవిని పోషిస్తున్నాయి. అదేంటి, అసలు సముద్ర తిరమే లేనప్పుడు వాటికి నేవితో పని ఏముంది, ఆ దేశాలు ఎందుకని ఇంకా యుద్ద నౌక విభాగాన్ని నిర్వహిస్తునాయి అసలు ఆ దేశాలు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్నలు మనలో చాలమందికి వస్తాయి అటువంటి వారి కోసం, నేవిని నిర్వహిస్తున్న టాప్ 5 ల్యాండ్ లాక్ దేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

5) స్విట్జర్లాండ్

Do You Know Why These Countries Are Using Marines Which Country Has No Access To The Ocean
Switzerland 

     ప్రపంచంలోనే అత్యంత సుందరమైన దేశాలలో స్విట్జర్లాండ్ కూడా ఒకటని చెప్పవచ్చు అంధుకనే ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు ఆ దేశంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించటానికి వస్తుంటారు. స్విట్జర్లాండ్ అంటే కేవలం పర్యాటనకే కాకుండా ప్రపంచం ప్రసిద్దిగాంచిన ఎన్నో బ్రాండెడ్ వస్తువులకు ఆనవాళ్ళు. ఆ దేశంలో తయారు చేసే చాక్లెట్లు, గడియారాలు, బట్టలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆదరణ ఉంది కానీ స్విట్జర్లాండ్లో తయారయ్యే వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా వారికి కావల్సిన వస్తువులు దిగుమతి చేసుకోవాలన్నా అందుకు అవసరమైన సముద్ర మార్గం ఆ దేశానికి లేదు ఎందుకంటే ఆ అందమైన దేశం అటు ఫ్రాన్స్ ఇటు జర్మని దేశాల మద్య ఉన్న ఒక ల్యాండ్ లాక్ దేశం. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు స్విట్జర్లాండ్లో పుట్టిన ఒక నది వారి వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి దోహద పడుతుందంట. ఈ నది పేరు రైన్ రివర్ ఇది స్విట్జర్లాండ్లోనే పుట్టి ఫ్రాన్స్ జర్మని మీదగా ప్రయాణించి నెదర్ల్యాండ్స్ దగ్గర ఉన్న మహాసముద్రంలో కలుస్తుంది. యూరోప్ దేశాలలో అతి పెద్ద నదులలో ఒకటైన రైన్ రివర్ కున్న ప్రముక్యతను గుర్తించిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆ నది ప్రవహిస్తున్న ఇతర దేశాలతో కొన్ని ఒప్పందాలు చేసుకుంది దాని ప్రకారం స్విట్జర్లాండ్లో బయలుదేరిన వ్యాపార పడవలు ఫ్రాన్స్ మరియు జర్మని దేశాల సరిహద్దులను దాటుకుంటూ నెదర్ల్యాండ్స్ లో ఉన్న రోటర్ డ్యామ్ పోర్టు నుంచి ఇతర దేశాలకు రవాణా అవుతాయని నిపుణులు చెప్తున్నారు అందువల్ల ఈ సరుకు రవాణా చేసే నౌకలకు రక్షణగా ఉండడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం సొంత నేవిని నిర్వహిస్తుందంట. అంతే కాదు స్విట్జర్లాండ్లోని లేక్ జెనీవా, లేక్ మగ్గియోర్, లేక్ లుసర్న్ వంటి పలు పెద్ద పెద్ద సరసుల్లోని కొంత భాగాన్ని పక్క దేశాలతో పంచుకోవడం వల్ల ఆ సరసుల్లో గస్తీకాయడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం తన నేవిని వియోగిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

 

4) లావ్స్

Do You Know Why These Countries Are Using Marines Which Country Has No Access To The Ocean
Mekong river, Laos

     చుట్టూ పచ్చని కొండలు వాటి మద్య అందంగా నిర్మించిన బౌద్దరామాలతో ఉండే చిన్న దేశం లావ్స్. అసలు ఇలాంటి దేశం ఒకటి మన ఆసియా ఖండంలోనే ఉందనే విషయం మనలో చాలామందికి తెలియదు కానీ ఇది మన దేశానికి ఉన్న పశ్చిమ దేశాల్లో ఒకటిగానే కాకుండా భారతదేశానికి ఉన్న మంచి మిత్రదేశాలలో ఒకటని నిపుణులు చెప్తున్నారు. ఈ లావ్స్ దేశం చైనా, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా వంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటూ ప్రపంచంలోని ల్యాండ్ లాక్ దేశాల్లో ఒకటిగా చోటు సంపాదించుకునింది. లావ్స్ ఒక ల్యాండ్ లాక్ దేశం అవ్వడం చేత దీనికి కూడా సముద్ర తీర ప్రాంతం లేకపోయిన నావెల్ ఫోర్స్ ని మాత్రం నిర్వహిస్తుంది. అందుకు ప్రధానమైన కారణం మీకాంగ్ నది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నదుల్లో పన్నెండో అతి పెద్ద నదిగా ఆసియాలో ఏడో పెద్ద నదిగా పేరు సంపాదించుకునింది. ఇక్కడ ఉన్న టిబెటన్ హిమాలయన్ నదులలో పుట్టిన మీకాంగ్ నది చైనాలోకి ప్రవేశించి అక్కడి నుంచి మయన్మార్, లావ్స్, థాయిలాండ్, కంబోడియా మీదగా వచ్చి వియత్నాం దగ్గర ఉన్న సముద్రంలో కలుస్తుంది. ఈ నది ప్రవహించిన అన్నీ దేశాలతో లావ్స్ కూడా సరిహద్దులను పంచుకోవడంతో ఆ దేశానికి కూడా వారి సరిహద్దులను ఇతర చట్టవెతిరేకత వ్యాపారాలను అడ్డుకోవడానికి చిన్న పాటి నేవిని నిర్వహిస్తునట్లు నిపుణులు చెప్తునరు. లావ్స్ లో ప్రభుత్వం ఆద్వర్యంలో నడిచే నేవీలు దాదాపు రెండు నుంచి మూడు డజన్ల గస్తీ పడవలు ఉన్నాయంట. 

 

3) అజర్బైజాన్,తుర్క్మెనిస్తాన్,కజకిస్తాన్

Do You Know Why These Countries Are Using Marines Which Country Has No Access To The Ocean
Azerbaijan,Turkmenistan, Kazakhstan

     ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో కేవలం ఒక్కో దేశంగానే వివరించగ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా ఏకంగా మూడు దేశాల పేరు చెప్తున్నారెంటి అనే సందేహం మీకు కలిగుండచు అందుకు గల కారణం తెలియాలంటే ఈ దేశాల బౌగోళిక పరిస్తితుల గురించి ఒక్కసారిగా పూర్తిగా తెలుసుకోవాలి. తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్ దేశాలు సెంట్రల్ ఆసియా దేశాలుగా ఉంటే అజర్బైజాన్ మాత్రం అటు యూరోప్ కి ఇటు ఆసియాకి ఉన్న మద్య భూభాగంలో ఉన్నది. ఈ మూడు దేశాలు ఒక దానికి పక్కన ఒకటి ఉండడమే కాకుండా ఈ మూడు కూడా ప్రపంచంలోనే ల్యాండ్ లాక్ దేశాలుగా జాబితాలో భాగం సంపాదించుకొని ఉన్నాయి దాంతో ఈ మూడు దేశాలకు సముద్ర తీరం లేదు కానీ ఆ దేశాలు నావెల్ ఫోర్స్లు కలిగున్నాయి అందుకు ప్రధాన కారణం కాస్పియన్ సముద్రం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరసు అవడంచేత దాని పేరులో సముద్రం అనే పదాన్ని నాటి యూరోపియన్లు వాసులు జత చేశారు కానీ ఈ కాస్పియన్ సముద్రంకి నిజమైన సముద్రానికి సంబందం లేదని నిపుణులు చెప్తున్నారు. అటువంటి కాస్పియన్ సముద్రం అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్ దేశాల మద్యలో ఉండటం ఆ సరసు మద్యలో నుంచి ఆ మూడు దేశాల సరిహద్దులు వెళ్లడంతో ఆ దేశాలవారు తమ సరిహద్దులను రక్షించుకోవడానికి నాభి పోర్టుని కలిగున్నాయి.

 

2) బొలీవియా

Do You Know Why These Countries Are Using Marines Which Country Has No Access To The Ocean
Bolivia

     దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నా లాటిన్ అమెరికా దేశాలలో ఒకటిగా ఉన్న ఈ దేశం కూడా ల్యాండ్ లాక్ దేశాలలో ఒకటిగా చోటు సంపాదించుకునింది అయిన బొలీవియా ప్రభుత్వం నేవిని నిర్వహిస్తుందంట. ఆ దేశ నేవిలో కొన్ని వందల గస్తీ పడవలు దాదాపు ఐదువేలకి పైగా శిక్షితులు అయిన నేవల్ సిభంది ఉన్నారంట అందుకు కారణం బొలివియాలో ఉండే పలు నదులు పక్కనే ఉండే ఇతర లాటిన్ అమెరికా దేశాలలో కూడా ప్రవహించడంతో ఆ నదుల మీదగా అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకోవడానికి అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. బొలీవియా వంటి చిన్న ల్యాండ్ లాక్ దేశం అంత పెద్ద నాభి పోర్టును నిర్వహించడం వెనుక ఉన్న అసలు కారణం వేరే ఉందని మరి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. నిజానికి ఆ దేశం దాదాపు నూటముప్పై సంవత్సరాల క్రితం ల్యాండ్ లాక్ దేశం కాదంట ఆ సమయంలో బొలివియా కూడా సముద్రతీరం కలిగుండేదంట. అయితే వారి సరిహద్దు దేశం అయిన చిలీతో జరిగిన యుద్దంలో బొలీవియా సైన్యం పరాజయం పాలవ్వడంతో ఆ దేశానికి చెందిన తీరప్రాంతాన్ని మొత్తం చిలీ ఆక్రమించుకుంది అని చరిత్రకారులు చెప్తున్నారు. అప్పటి నుంచి పగతో రగిలిపోతున్న బొలీవియా సైన్యం ఎప్పటికైనా తాముకోల్పోయిన ప్రాంతాన్ని తిరిగి పొందుతామని నేటికీ బావిస్తుందంట. అందుకే ఆ దేశానికి సముద్రతీరం లేకపోయిన నదుల సరిహద్దులవద్ద అక్రమ రవాణా అడ్డుకోవడం అనే సాకును చెప్పి అంత పెద్ద నేవిని నిర్వహిస్తునట్లు నిపుణులు చెప్తున్నారు.

 

1) మంగోలియా

Do You Know Why These Countries Are Using Marines Which Country Has No Access To The Ocean
Mongolia

     ఈ దేశం పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది చెంఘీజ్ ఖాన్ పేరే ఒక్కప్పుడు దాదాపు ప్రపంచాన్ని శాసించిన ఆ మంగోలియన్ చక్రవర్తి వద్ద కొన్ని వేల యుద్ద నౌకలు లక్షల మంది నావిక సిభందితో  ప్రపంచంలోనే అతి పెద్ద నేవీ కలిగిన రాజ్యాంగా ఉండేది. కాలగమనంలో ఆ రాజ్యం పరిధి కొద్దికొద్దిగా కుచించుకుపోయి ప్రస్తుతం చైనా రష్యాల మద్య ల్యాండ్ లాక్ దేశంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న మంగోలియా దేశం దాదాపు ఎత్తైన హిమ సికరాలతో ప్రపంచంలోనే అత్యదిక మంచు ప్రాంతం కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. ఆ దేశం కూడా నేడు నాభి పోర్టులను కలిగుండడం అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తే వారి వద్ద ఉన్న బలగాన్ని చూస్తే కాస్త నవ్వు రాక తప్పదు ఎందుకంటే వారి వద్ద కేవలం సుఖబాటర్ 3 అనే ఒకే ఒక్క యుద్ద నౌక ఉండగా అంధులో కేవలం ఏడుగురు సిభంది మాత్రమే ఉంటారు అని వారిలో కేవలం ఒకరికి మాత్రం ఈత కొట్టడం వచ్చని ఒకవేళ నౌక మునిగితే తక్కినవారికి తప్పించుకునే విధానం కూడా వారికి తెలియదని నిపుణులు చెప్తున్నారు. మరి ఇంత బలహీనమైన నేవిని మంగోలియా ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది అనే ప్రశ్నకి ఒకే ఒక్క సమాధానం ఖువ్స్గుల్ సరసు. ఇది ఆ దేశంలో ఉన్నా ఒక పెద్ద సరసు అని అది రష్యాతో సరిహద్దుని పంచుకొని ఉండడంతో అక్కడ రక్షణ కోసం మంగోలియా ప్రభుత్వం సుఖబాటర్ 3 అనే నౌకను గస్తీకి వాడటం జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

 

 

Post a Comment

0 Comments