నేడు మన దేశంలోని ఈ TOP 5 Teachers గురించి తెలిస్తే మీ రోమాలు నిక్కపొడుచుకోవటం ఖాయం -Telugu Facts

     ధర్మబద్దమైన సమసమాజ స్థాపనకు విద్యావంతులు అయిన యువకులు అవసరం చాలా ముక్యమని ఎంతోమంది పుణ్య పురుషులు చెప్పిన మాట. సమాజంలోని అసమానతలుపోవాలన్న ప్రజలంతా సంతోషంగా జీవించటానికి మనుషులంతా విద్యావంతులుగా వివేకవంతులుగా మారడం ఎంతో అవసరం. అంధుకే అటువంటి విద్యను వివేకాన్ని నేర్పించే మన గురువులను ఎంతగానో గౌరవం ఇవ్వాలని మన పురాణాల నుంచి పెద్దల వరకు చెప్తున్నారు. ఒకప్పుడు ఆకలి మంటతో డొక్క కాలుతున్నా విద్యాబీక్షకై వచిన్న శిష్యుడికి తాను సంపాదించిన ద్యానం మొత్తం ధారపోయడమే పరామవతిగా బ్రతికిన గురువులు ఉండేవారని అనేవారు. కానీ మారుతున్న కాలం పెరుగుతున్న ధరలు భారమైన కుటుంబపోషణను దృష్టిలో పెట్టుకొని విద్యను వ్యాపారంగా చేసిన బడాబాబుల నీడన చేరాల్సిన పరిస్థితికి గురువులని దిగజార్చింది నేటి సమాజం. అంధువల్ల నేడు డబ్బు కట్టగలిగే స్తోమత ఉన్వారి బిడ్డలకు మాత్రమే విద్య సొంతం అవుతుంటే పుట పొట్ట నింపుకోవడమే కష్టంగా బ్రతికే బడుగుజీవులకు ఆ చదువు ఒక కలగానే మిగిలిపోతుంది. చదవాలన్న తపన మిలొ ఉంటే మీకు చదువు చెప్పగల శక్తి మాకు ఉందంటూ కొంతమంది ఉపాద్యాయులు కూలీ చేసుకొని బ్రతికే కడుపేద ప్రజల పిల్లలకు ఎన్నో అడ్డంకులకు ఎదురు నిలిచి మరి తమ వద్ద ఉన్న ద్యానాన్ని పంచిపెట్టారు పెడుతున్నారు ఈ క్రమంలో తన ప్రాణాలను సైతం పోగొట్టుకున్న గురువులు కూడా ఉన్నారు. మన దేశంలో అటువంటి టాప్ 5 గురువుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.       

 

5) బాబర్ అలీ

Best Teachers In India
Babar Ali

     విద్యను చెప్పడానికి అయిన నేర్చుకోవడానికి అయిన వయసుతో పనివుండదు అని మన పెద్దలు చెప్తుంటారు సరిగ్గా ఈ మాటలను నిజం చేసి చూపించాడు వెస్ట్ బెగాల్ లోని ముర్షిదాబాద్ నగరానికి చెందిన బాబర్ అలీ అనే ఉపాద్యాయుడు. పేదరికంలో పుట్టిన బాబర్ అలీ చదువుమీద ఉన్న ఆసక్తితో దగ్గరలోని ఓ చిన్న బడిలో చదువుకునేవాడు అయితే అదే ప్రాంతంలో ఉండే చాలామంది పేద ప్రజల పిల్లలు తల్లితండ్రులతో కలిసి పనులు చేసుకుంటూ చదువుకు దూరం అవుతున్నారని గమనించిన అలీ తొమ్మిదేళ్ల వయసు నుంచే బడికి వచ్చీ చదువుకోలేని పిల్లలకు ప్రతిరోజూ తాను చదువుకున్న పాఠాలను సాయంత్రం వెళ్లలో ఆ పిల్లలకు చెప్పేవారంట. అంత చిన్న వయసులోనే తనతో పాటు మిగతా పిల్లలు కూడా తనలాగే చదవాలనే ఆశయం కలిగిన బాబర్ అలీ బడిలో అరిగిపోయిన చిన్న చిన్న చాక్పీసులను తీసుకొచ్చి నల్లగా ఉండే టైల్స్ పైన రాస్తూ పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు. అలా అతను పదిహేడు ఏళ్లకే తాను చదివిన బడికి ప్రధానోపాధ్యాయుడు అయ్యి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులోనే ఆ గనత సాదించిన వ్యక్తిగా పేరుపొందాడు. ఇప్పుడు బాబర్ అలీ పాఠశాలలో దాదాపు నాలుగు వందల మంది పేద పిల్లలు చదువుకుంటున్నారు.

 

4) ఆదిత్య కుమార్

Best Teachers In India
Cycle Guru Aditya Kumar

     పాఠశాల చదువులు భారంగా మారిన ఈ రోజుల్లో ఆ వైపు చూడటానికే పేద పిల్లలు సాహసరించలేకపోతున్నారు దాంతో చదవాలనే ఆశ ఉన్న పిల్లలు బడికి వెల్లనవసరంలేదు వారి వద్దకే పాఠశాలను తీసుకెళ్లాలని బావించిన ఆదిత్య కుమార్ లక్నో సమీపంలోని మురికివాడలో ఉండే పేద పిల్లల వద్దకు సైకిల్ పై వెళ్ళి చదువు నేర్పిస్తున్నాడు. సైకిల్ వాలే గురూజి అనే పేరుతో ఆ ప్రాంతంలో ఎంతో పేరుగాంచిన ఆదిత్య కుమార్ 2017లో ఓ పాత సైకిల్ని కొనుకొని దానిపై లక్నో నుంచి రాంచి వరకు తిరుగుతూ పేద పిల్లలలో విద్య పట్ల అవగాహన పెంచటమే కాకుండా ఎంతో మందికి విద్యాప్రధాతగా మారాడు. భారతదేశంలో నిరక్షఅవస్తతే ఉండకూడదనే ఉద్దేశంతో తన జీవితాన్నే ధారపోసిన ఈ మహానుబావుడు గురించి ఎంత చెప్పిన తక్కువే.

 

3) ప్రొఫెసర్ సందీప్ దేశాయ్

Best Teachers In India
Professor Sandeep Desai

     భూమిపై ఉన్న అన్నీ దేశాలు ప్రపంచీకరణ వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో ఆంగ్ల బాషలో విద్య నేర్చుకోవటం నేటి తరం విధ్యార్థులకు ఎంతో అవసరంగా మారిపోయింది. అంధుకే మన దేశంలో కూడా గత రెండు మూడు దశాబ్దాలుగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు కుప్పలుగా వెలిశాయి. అయితే ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పినా చదవలేని పరిస్థితీల్లో ఎంతోమంది పిల్లలు ఇప్పటికీ ఉండగా ఇక అలాంటి పిల్లలకి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చదువు అంటే ఈ జన్మకయ్యే పనికాదు అని అనుకునేవారు. కానీ అటువంటి ఆలోచనకు అడ్డుకట్టి మిలొ చదవాలన్న కోరిక ఉంటే నాతో పాటురండి నేను మీకు విద్యను ఇవ్వడానికి ఎంత దూరం అయిన వెళ్లడానికి సిద్ధం అంటూ ముందుకు వచ్చిన ఓ మహానుబావుడు ప్రొఫెసర్ సందీప్ దేశాయ్. ఆయన రాజస్తాన్ మహారాష్ట్ర రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో ష్లోక అనే చారిటి పేరు మీద కొన్ని పాఠశాలలను స్థాపించి అంధులో ఆయా ప్రాంతాల్లో ఉండే పేద విధ్యార్థులకు ఆంగ్ల బాషలో విద్య నేర్పుతున్నాడు. ప్రొఫెసర్ సందీప్ దేశాయ్ కూడా ఓ మద్య తరగతి మనిషి అవ్వడంతో ఆ పాఠశాలల నిర్వహణ తలకుమించిన భారంగా మారింది దాంతో అప్పటి నుంచి ఆయన ముంబై మెట్రో రైళ్లలో తాను నిర్వహించే ష్లోక చారిటి గురించి అంధరికి తెలియచేస్తు చందాలు అడుగుతూ అలా వచ్చిన డబ్బులతో ఆ పాఠశాలలను నడుపుతున్నాడు. అతని గురించి తెలిసిన కొన్ని వార్తా పత్రికలవాళ్లు పలు కథనాలను వారి పత్రికలో ముద్రించగా ఆ కథనాలను కత్రించుకొని వాటిని లామినేషన్ చేయించి ముంబై మెట్రో రైళ్లలో వెళ్ళే వ్యక్తులకు తనపై నమ్మకం కలిగి డబ్బులు ఇస్తారనే ఆశతో ఆ కథనాలని చూపిస్తూ ప్రతిరోజూ కొంతసేపు చందాలు అడుగుతుంటాడు ప్రొఫెసర్ సందీప్ దేశాయ్.

 

2) రాజేష్ కుమార్ శర్మ

Best Teachers In India
Rajesh Kumar Sharma

     చదువు పంచాలనే తపన ఉన్న ఉపాద్యాయుడు నేర్చుకోవాలనే ఆసక్తి బలంగా ఉండే విధ్యార్థులు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదురించి తాము అనుకున్న లక్షాన్ని సాదించగలరని మన దేశ రాజధానిలో ఉన్న ఈ పాఠశాలను చూస్తే మీకే అర్ధమవుతుంది. డిల్లీలో ఉండే అనేక మంది పేద పిల్లలు చదువుకు దూరమైన వివిద పనులు చేసుకుంటూ కాలాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. చదువుకుంటే వారి స్థితిగతులు కాస్త మెరుగుపడుతాయని ఆశించిన రాజేష్ కుమార్ శర్మ అనే వ్యక్తి ఆ నగరంలో నిరక్షరాసిట అనేది ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అనుకునది ఆలస్యం అన్నట్లుగా 2007లోని ఎమునా మెట్రో రైలు బంగ్ స్టేషన్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కింద తన పాఠశాలను కేవలం ఇద్దరు పేద విధ్యార్థులతో మొదలు పెట్టాడు అతని బలమైన ఆశయం చూసి తాము కూడా చదువు నేర్చుకోవాలని తపన పెంచుకున్న అక్కడి మురికివాడలోని పిల్లలు ఒక్కొక్కరుగా రాజేష్ కుమార్ శర్మ మొదలు పెట్టిన పాఠశాలలోకి వచ్చీ చదువు నేర్చుకునేవారు. అలా ఇద్దరితో మొదలు పెట్టిన ఆ పేదల పాఠశాల నేడు దాదాపు రెండు వందల మంది విధ్యార్థులు కలిగిన ఫ్లైఓవర్ కింద పాఠశాలగా ఎంతో ప్రసిద్ది పొందింది.

 

1) బరుణ్ బిశ్వాస్

Best Teachers In India
Barun Biswas

     సమాజంలో పెద్ద వ్యక్తులుగా చలామణి అవుతూ పేద ప్రజలకు తీరని అన్యాయం చేయటమే కాకుండా న్యాయం అడిగినవారిని చంపించటం వారి ఇళ్లలోని మహిళలపై అఘాయిత్యాలు వంటి ఎన్నో గోరాలు చేస్తున్న వ్యక్తుల బారి నుంచి పేద ప్రజలను రక్షించడమే తన లక్ష్యంగా ముందు అడుగు వేశాడు ఓ వ్యక్తి. అంధుకోసం సమసమాజ స్థాపన జరగాలని దానికి బడుగు బలహీనత వర్గాల ప్రజలంతా విద్యావంతులు అవ్వాలని కలలుకన్న ఓ యువ ఉపాద్యాయుడు ఒక ప్రాంతంలో పెనుమార్పును తీసుకొనిరావడమే కాకుండా ఆ ప్రక్రియలో తన ప్రాణాలనే పోగొట్టుకొని ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయాడు. వెస్ట్ బెంగాల్ లోని సుతీయ అనే ఊరిలో ఉన్నా కొంతమంది రౌడీలు బడాబాబులు పేదవారి ఇళ్ళలో ఉన్న ఆడవారి పై అఘాయిత్యాలు చేస్తూ అడ్డువచ్చినవారిని చంపుతూ అక్కడి ప్రజలని భయభ్రాంతులకు గురిచేసేవారు. ఈ విదంగా వారు సుతీయ నగరంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో తమ ఆదిపత్యాన్ని చాటుతు తమకు కావల్సిన పనులన్నీ చేయించుకునేవారు. ఈ దారుణాలను చూడలేని కొంతమంది ప్రజలు తిరగపడగ వారి గొంతులలో గొంతు కలిపి ఉద్యమాన్ని ముందుకు తీసుకొనిపోయాడు బరుణ్ బిశ్వాస్ అనే వ్యక్తి. ఈ ఉద్యమం కోసం సుతీయ ఒక సంస్థాని మొదలు పెట్టగా దానికి బరుణ్ బిశ్వాస్ సహ వ్యవస్థపకుడుగా ఉన్నాడు ఆ సంస్థ సాయంతో బడబాబులు చేస్తున్న అకృత్యాలు మీద పోరాటం చెయ్యడమే కాకుండా మురికివాడలో ఉండే పిల్లలకు ఉచితంగా విద్య నేర్పుతూ ఆ ప్రాంతంలోని పేద పిల్లలందరిని అక్షరాభ్యాసాలుగా తీర్చిదిద్దాలని ఆశించాడు. అయితే సుతీయ నగరంలో అతను చేస్తున్న పనులకు విసిగిపోయిన కొంతమంది బడాబాబులు 2012 జూలై 5వ తేదీన హత్యచేశారు. అయితే బరుణ్ బిశ్వాస్ చనిపోయినా అతను రగిలించిన ఉద్యమచ్చుతి మాత్రం మరింతగా విజృబించి నేరస్తులకు శిక్షలుపడేలా చేయడమే కాకుండా సుతీయ ప్రాంతంలోని రౌడీయిజాన్ని అదుపు చేయగలిగింది. బరుణ్ బిశ్వాస్ చనిపోయే సమయానికి అతని వయసు కేవలం 39 ఏళ్ళు అయినా అతడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయ్యాడు.

                              "ప్రపంచం ఆధునికతా వైపు పరుగులు తీస్తున్న ఈ కాలంలో మన దేశంలో మాత్రం ఇంకా విద్య ఎంతో మంది ప్రజలకు అందని ద్రాక్షగా మారిపోయింది. అందరికీ కనీసహక్కులలో బాగమైన విద్య నేడు పెద్ద వ్యాపారంగ మారిపోయింది ఇలాంటి సమయంలో ఉపాద్యాయ వృతి వెనక ఉన్నా అసలైన లక్షాన్ని గుర్తించిన ఈ ఉపాద్యాయులకు మాత్రం కనీస గుర్తింపు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇప్పటికైనా ఇటువంటి ఉపాద్యాయుల కథలను అందరికీ తెలియచెయ్యాలి".

 

 

Post a Comment

0 Comments