ప్రపంచంలోని అభివృద్ది చెందిన దేశాలలో టాప్ 5 Most Dangerous వీధులు ఇవే...! -Telugu Facts

     కాలమాన పరిస్థితిలో మనిషి ప్రవర్తనని తద్వారా ఒక సమాజ స్థితిగతులను ప్రభావితం చేస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఆ కారణంగానే మన ప్రపంచంలో ధనిక అభివృద్ది చెందుతున్న నిరుపేద అనే మూడు రకాలైన ఎత్యాసాలు గల దేశాలు ఉన్నాయి. ధనిక దేశాలలో అలాగే అభివృద్ది చెందుతున్న దేశాలలోని ప్రభుత్వాలు అక్కడి చట్టాలను సమర్ధవంతంగా అమలు చెయ్యడానికి శాయశక్తుల ప్రయత్నిస్తాయి దాంతో ఆయా దేశాలలో నివసించే ప్రజలు ఎక్కువ మంది ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఆనందమైన జీవితం కోసం ఎదురుచూస్తుంటారు. పేద దేశాలలో చాలా వరకు ఇందుకు విరుద్ధమైన వాతావరణం ఉండడంతో ఆయా దేశాలకు విదేశీయులు ఎవ్వరూ సరదాగా తిరగడానికో లేదా అక్కడ డబ్బులు పెట్టి వ్యాపారాలు చెయ్యడానికి అంతగా ఆశక్తి చూపించారు. అయితే బాగా అభివృద్ది చెందుతున్న లేదా పర్యాటకులకు బాగా పేరుగాంచిన దేశాలలో కూడా కొన్ని భయంకరమైన వీధులు లేదా కాలనీలు ఉంటాయని అక్కడికి వెళ్ళినవారు ప్రాణాలతో బయటపడతారో లేదో కూడా చెప్పడం కష్టమనే విషయాలు ఈ ప్రపంచంలోని ప్రజల్లో చాలమందికి తెలియదనే చెప్పాలి. ఇప్పుడు మనం అటువంటి భయంకరమైన టాప్ 5 వీధులు గురించి తెలుసుకుందాం.   

 

5)కింగ్ స్టన్, జమైకా 

Top 5 Most Dangerous Streets In Developed Countries
Kingston

     ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల మద్య ఉన్న కరేబియన్ దీవులు ప్రపంచంలోనే అత్యంత సుంధరమైన బీచ్‌లకు ప్రకృతి అందాలకు జీవ వైవిద్యానికి బాగా ప్రసిద్ధి అందుకే అక్కడ ఉండే వివిద ద్వీప దేశాలకు సరదాగా సెలవులకు ఆనందించడానికి విదేశీ పర్యటకులు ప్రతి సంవత్సరం వేల సంక్యలో వస్తుంటారు. అంధులోను వాటిలో చాలా వరకు పేద దేశాలు అవ్వడం చేత అక్కడి ప్రభుత్వాలు పర్యాటక మీద వచ్చే ఆదాయం పై ఎక్కువుగా ఆధారపడటంతో దానికి అనుగుణంగానే పలు చర్యలు తీసుకుంటాయి. అదే విదంగా ఆ ప్రాంతంలో ఉన్న జమైకా అనే ద్వీప దేశం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటకులను ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఆ దేశ రాజధాని కింగ్ స్టన్ లోని కొన్ని ప్రాంతాలు మాత్రం అత్యంత భయంకర పరిస్థితులను నెలకొన్నాయి. ఆ దేశానికి వచ్చే పర్యాటకులకు మత్తు పధార్థాలు అమ్మి సొమ్ము చేసుకోవడానికి కొన్ని మూఠలవారు పనిచేస్తున్నారు. వారి మద్య జరిగే ఆధిపత్య పోరులో తరచూ కాల్పులు జరుగుతుంటాయి అని అంతేకాక రాత్రివేళలో ఒంటరిగా తిరిగే విదేశీయుల పై దాడులు చేసి సొమ్మును కాజేయడంతో పాటు మాట విననివారిని చంపేసిన సంగటనలు కూడా చాలానే ఉన్నాయని పరిశీలకులు చెప్తున్నారు. అంధుకే అమెరికా ప్రభుత్వం కూడా జమైకాలోని కింగ్ స్టన్ నగరానికి వెళ్లాలనుకునేవారికి అక్కడ ఎలా ఉండాలి కేవలం ఏఏ ప్రదేశాల్లో మాత్రమే తిరగాలి అనే విషయాలను తెలియచేస్తుంది.

 

4) రియో డి జానీరో, బ్రజిల్

Top 5 Most Dangerous Streets In Developed Countries
Vila Alianca Street

     దక్షిణ అమెరికా ఖండంలో బాగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో బ్రజిల్ ముందు వరసులో ఉంటుంది ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ వర్ష అరణ్యాలు కలిగిన ఈ దేశం ఎంతో విలువైన ప్రకృతి సంపదకు ప్రపంచంలో మరెక్కడా చూడని జంతు వైవిద్యానికి పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నదుల్లో ఒకటైన అమెజాన్ ఈ దేశంలోనే ఎక్కువుగా ప్రవహిస్తుంది ఈ కారణాలతో ఆ దేశంలోని వింతలు విశేషాలను వీక్షించడానికి విదేశీ పర్యటకులు ఎంతోమంది వస్తుంటారు. వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న ఆ దేశంలో చూడటానికి ఎన్ని అందాలు ఉన్నాయో అంతకుమించి ప్రమాధాలు ఉన్నాయి మరి ముక్యంగా బ్రజిల్ పాత రాజధాని అయిన రియో డి జానీరోకి పశ్చిమంగా బంగు అనే ప్రదేశం ఉంది అక్కడ విలా అలియాంక అనే ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఒకటిగా నిలిచింది. ఆ దేశంలో అటువంటి ప్రదేశాలు చాలానే ఉన్నా విలా అలియాంక మాత్రం చాలా ప్రత్యేకమని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఆ ప్రదేశం పూర్తిగా చీకటి వ్యాపారాలు చేసే మాఫియా ముఠాల చేతులోనే ఉంటుంది. విలా అలియాంక ప్రాంతంలో ప్రతి ఒక్కరి చేతిలో మారణ ఆయుధాలు ఉంటాయంట మరి ముక్యంగా యువత పట్టపగలే చేతులో తుపాకులు పట్టుకొని తిరుగుతారని అక్కడికి పోలీసులు వెళ్లడానికి కూడా ఒకటికి వందసార్లు ఆలోచిస్తారని పలువురు నిపుణులు చెప్తున్నమాట. ఎప్పుడు చూసిన ఈ ముఠాల మద్య పోలీసుల మద్య కాల్పులు జరుగుతూనే ఉంటాయని దాంతో అక్కడ మరణాల శాతం కూడా చాలా ఎక్కువని కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. ఇక అటువంటి ప్రదేశంలోకి పర్యటకులు వెళ్తే జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరంలేదు.

 

3) టిజువానా, మెక్సికో

Top 5 Most Dangerous Streets In Developed Countries
Tijuana America Border

     రెండు అమెరికా ఖండాలను కలుపుతూ మద్యలో ఏర్పడ్డ సుంధరమైన దేశం మెక్సికో. ఎన్నో ప్రకృతి వనరులు ఉన్నా ఈ దేశం ఆర్ధికంగా అభివృద్ది చెందుతున్న దేశాలలో ఒకటిగా ఉంది. అయితే దాని పక్కనే అమెరికా వంటి ధనిక దేశం ఉండడంతో మెక్సికోకి చెందిన పౌరులతో పాటు తక్కిన దక్షిణ అమెరికా ఖండంలోని  దేశాల్లో గల ప్రజల్లో చాలామంది ప్రపంచ పెద్దన్న పంచన చేరాలని అనుకుంటారు అంధుకోసం అమెరికా సరిహద్దులలో ఉన్నా టిజువానా అనే మెక్సికో నగరం నుంచి దొంగచాటున సరిహద్దు దాటి వెళ్లడానికి ప్రయత్నిస్తారంట . దాని వల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కొన్ని మాఫియా ముఠాలవారు అక్రమ మానవ రవాణా మత్తు పధార్థాల అక్రమ రవాణా వంటి చీకటి కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తుంటారంట. దాంతో అక్కడ కూడా ఈ ముఠాల మద్య పోలీసులు సరిహద్దు భద్రతా దళాల మద్య దాదాపు ప్రతిరోజూ చిన్న పాటి యుద్దలే జరుగుతుంటాయి. రాత్రివేళలో ఒంటరిగా తిరిగే సామాన్య ప్రజలు పర్యటకులను లక్ష్యంగా చేసుకొని స్థానిక మాఫియా ముఠాలు దొంగతనాలకు పాల్పడతారని మాట విననివారిని చంపడానికి కూడా వెనకాడరని నిపుణులు చెప్తున్నారు. ఈ కారణాల వల్ల ప్రపంచంలోనే అత్యదిక హత్యలు జరిగే దేశాల్లో టిజువనా ఒకటిగా నిలిచినట్లు పలు గణాంకాలు చెప్తున్నాయి.

 

2) కేప్ ఫ్లాంజ్, కేప్ టౌన్

Top 5 Most Dangerous Streets In Developed Countries
Cape Plaja Street

     మన జాబితాలో ప్రపంచంలోనే భయంకరమైన వీధులున్న ప్రదేశాల్లో రెండో ప్రాంతం దక్షిణ ఆఫ్రికా రాజధాని అయిన కేప్ టౌన్ నగరంలోని కేప్ ఫ్లాంజ్. భూమిపై అధిక అటవి ప్రాంతంతో పాటు నీరు పేద దేశాలకు ఎక్కువుగా ఉండే ఖండాలలో నిరుపేద దేశంలో ఎక్కువుగా ఖండాలలో ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది. అక్కడ అనేక దేశాల్లో అంతర్గత గొడవలతో ఉగ్రవాద సమస్యలతో ప్రాతినిథ్యం రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి అయితే వాటన్నిటిలో కళ్ల దక్షిణ ఆఫ్రికా దేశం ఎంతో బిన్నంగా బాగా అభివృద్ది చెందుతున్న దేశాలలో ఒకటిగా ఉంది. అంతేకాక ఆ దేశం ప్రకృతి అందాలకు సుందరమైన బీచ్‌లకు ఎంతో ప్రసిద్ది దాంతో ఎన్నో దేశాల నుంచి పర్యటకులు వేల సంక్యలో దక్షిణ ఆఫ్రికాకి వస్తుంటారు. అయితే ఆ దేశ రాజధానికి వచ్చే పర్యాటకులకు కేప్ ఫ్లాంజ్ అనే ప్రాంతం వైపుకి కూడా వెళ్లకూడదని అక్కడి గైడ్ లతో పాటు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. కొంతమంది నిపుణులు చెప్పిన దాని ప్రకారం కేప్ ఫ్లాంజ్ అనేది చాలా పెద్ద ప్రాంతం అని అక్కడ జరిగే హింసని నియంత్రించలేక ఆ ప్రాంతం చుట్టూ ఒక రక్షణవలయాన్ని స్థానిక పోలీసులు ఏర్పాటు చేశారని తెలుస్తుంది దాంతో కేప్ ఫ్లాంజ్లో ఉండే నేరస్తులు బయట ప్రాంతాలకు రాకుండా విదేశాల నుంచి వచ్చే కొత్త వ్యక్తులు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఆ రక్షణ గోడల దగ్గర ఉండే పోలీసులు ప్రతినిత్యం కాపలాకాస్తుంటారు. 2019లో జరిగిన ఆద్యాయనంలో ఆ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే దాదాపు వెయ్యి హత్యలు జరిగాయని అక్కడ ఒక వారంలో డెబ్బై నుంచి ఎనబై హత్యలు జరుగుతుంటాయని ఎన్నో ఆద్యాయన్నాలో తేలింది. అక్కడ గ్యాంగ్ వార్లు దొంగతనలు అమ్మాయిలను అపహరించి వ్యబిచారం చేయించే గ్యాంగులకు అమ్మేయడం ఇలా ఒకటేమిటి చీకటి సామ్రాజ్యంలో ఎన్ని అకృత్యాలు జరుగుతాయో అవన్నీ కేప్ ఫ్లాంజ్లో జరుగుతాయంట. అంధుకే దక్షిణ ఆఫ్రికా రాజధానిలో ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాధాకరమైన ప్రదేశంగా రికార్డులోకి ఎక్కింది.

 

1) బాల్టిమోర్, అమెరికా

Top 5 Most Dangerous Streets In Developed Countries
Baltimore Street

     ఇంతవరకు ఈ జాబితాలో అభివృద్ది చెందుతున్న లేదా పర్యాటకులకు బాగా పేరుగాంచిన దేశాలలో ఉండే భయంకరమైన ప్రాంతాలు వీధుల వంటి వాటి గురించి తెలుసుకున్నాం అయితే ఇది టాప్1 మాత్రం చాలా ప్రత్యేకంతో పాటు ఇది విన్న వారికి ఆశ్చర్యాన్ని కలగచేయకమానదు. ఎందుకంటే ఆ భయంకరమైన వీధులు ఉన్నది అమెరికాలోని అతిపెద్ద నగరంలో ఒకటైన బాల్టిమోర్‌లో ఆ నగరంలో ఉన్న నార్త్ మాన్రో ఇంకా వెస్ట్ ల్యాండ్వెల్ అనే రెండు వీధులు పర్యాటకులు ఏమాత్రం అడుగు పెట్టకూడని ప్రదేశాలని నిపుణులు చెప్తున్నారు. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో లాగా ఆ వీధిలలో ఫోటోలు తీయడానికి స్థానికంగా ఉండేవారు ఒప్పుకోరు అందులోనూ ఎవరైనా పర్యాటకులు మంచి కరిధైన కేమరాలతో ఆ వీధుల్లో కనపడితే వారిని కచ్చితంగా దొంగలు వెంటాడతారు అంట. నార్త్ మాన్రో వీధి ఇంకా వెస్ట్ ల్యాండ్వెల్ వీధిలో దాదాపు దొంగతనాలు చేసేవారు డ్రగ్స్ చట్టవిరుద్ద ఆయుధాలు అమ్మే మాఫియా గ్యాంగుల సభ్యులతో నిండి ఉంటాయంట. దాంతో సద్యమైనంత వరకు ఆ ప్రదేశాలకు వెళ్లకూడదని ఒకవేళ వెళ్ళిన రాత్రుల్లో ఒంటరిగా మాత్రం బయటికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తారు అని నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ వింత ఏంటంటే ఆ ప్రాంతంలో విదులు నిర్వహించే పోలీసులలో చాలామంది లంచాలు తీసుకుంటారని అంధువల్ల వారిలో చాలామందికి ఇప్పటికే కోర్టులో శిక్షలు కూడా పడ్డాయని పలు అధ్యాయాలు చెప్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఒక సర్వే ప్రకారం మొత్తం అమెరికాలో నమోద్ధయ్యే నేరాల కంటే పంతొమ్మిది శాతం ఎక్కువుగా కేవలం ఆ రెండు వీధులోనే జరుగుతాయని తేలింది. దీన్ని బట్టి బాల్టిమోర్‌లోని నార్త్ మాన్రో వీధి వెస్ట్ ల్యాండ్వెల్ వీధిలు ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు.    

 

 


Post a Comment

0 Comments