మన దేశానికి బయట దేశాలలో ఉన్న టాప్ 10 Military Bases ఇవే - Telugu Facts

     

Indian overseas military bases

      ప్రపంచ యావనిక పైముఖ దేశానికి సముచిత గౌరవం దక్కాలంటే ఆ దేశం ప్రధానంగా అంగ ఆర్ధ బలాలలో పరిపుష్టిత సాదించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తుంటారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న అనేక దేశాలు అంధుకోసం నిరంతరం కృషి చేస్తుంటాయి. అటువంటి దేశాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థలు కలిగిన భారతదేశం కూడా ఉందని చెప్పడంలో ఎంటువంటి సందేహం లేదు. భూమి పై గల తొలి పది బలమైన ఆర్ధిక వ్యవస్తలు కలిగిన దేశాల్లో మన దేశం కూడా ఉండగా అత్యంత బలమైన రక్షణ వ్యవస్త ఉన్నా దేశాల్లో మనది నాలుగో స్థానం అని పలు అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా దాయాది దేశంతోను అది సృష్టించి మనపై ఉసిగొలుపుతున్న ఉగ్రవాదుల్తోను మరో పక్క మన వెనకాలే గోతులు తవ్వే జిత్తుల్లమారి చైనాతోనూ మన దేశాన్ని రక్షించుకోవడానికి అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్తను సిద్దం చేసుకోవడం అత్యంత అవసరంగా మారింది ఈ క్రమంలో మన దేశ సరిహద్దుల్లో సైనికుల స్థావరాలను ఏర్పాటు చేసుకొని వాటిని పటిష్టపరుచుకోవడమే కాకుండా బయట నుంచి వచ్చే అపాయలను ఎదురుకోవడానికి దేశం వెలుపలకూడా వ్యూహాత్మక ప్రదేశాల్లో మన Military Bases ను ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరమని గుర్తించిన మన నిపుణులు అంధుకు తగినట్లు కొన్ని దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకొన్నారు. ఈ విదంగా మన దేశం ఇతర దేశాల్లో ఏర్పాటు చేసిన Top 10 military bases గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

10) మొజాంబిక్యూ (Mozambique)

      మన దేశంతో సంబంధం కలిగున్న ఆఫ్రికా దేశాల్లో మొజాంబిక్యూ కూడా ఒకటి. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంగ ఉన్న మొజాంబిక్యూలో ఉన్నా పోర్టులు యూరోపియన్ దేశాలకు ఆసియా దేశాలకు మద్య జరిగే జల రవాణాలో ముక్య పాత్ర పోషిస్తాయని అంతర్జాతీయ నిపుణులు చెప్తారు. ఈ కారణాలవల్ల ఆ దేశంతో భారతదేశం ఎన్నో ఏళ్లుగా స్నేహపూర్వకంగానే కాకుండా మన నౌకాదళం అక్కడి సముద్ర జలాల భద్రతనికూడా పర్యవేక్షిస్తుందంట. ఈ నేపద్యంలో 2003 జూలై 8 నుంచి 11 వరకు మొజాంబిక్యూ రాజధాని మపుటోలో ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ జరగగా అంధులో మొజాంబిక్యూ తీర ప్రాంత రక్షణ కోసం భారతదేశం సాయం కోరాలని తీర్మాయించుకున్నారు దాంతో అప్పటినుంచి మన భారత నౌకాదళం అక్కడి తీర ప్రాంతాలను గస్తీ కాస్తు సముద్ర దొంగల నుంచి వ్యాపార నౌకాలను రక్షించడమే కాకుండా మన దేశం పై జరిగే కుట్రలను పసికట్టి ఆ సమాచారాన్ని మన దేశంలోని నిఘా సంస్థలకు అందిస్తుంది.  

 

9) మాల్దీవులు (Maldives)

      ప్రపంచంలోని అత్యంత సుందరమైన బిచ్లు ఉన్నా దేశాల్లో మాల్దీవులు ముందు వరసులో ఉంటాయి. అసలు ఈ ద్వీప దేశం ప్రధాన ఆదాయ వనరులు మొత్తం అక్కడి బిచ్లు చూడటానికి వచ్చే విదేశీ పర్యటకులు పై ఆధారి పడి ఉంటుంది. అరేబియన్ మహా సముద్రంలో మన దేశానికి అత్యంత దగ్గర ఉన్నా ద్వీప దేశం ఎంతో కాలంగా భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. అదిక శాతం పర్యాటక రంగంపైనే ఆధారి పడి బ్రతికే ఆ దేశానికి జాతీయ భద్రత మాత్రం చాలా బలహీనంగా ఉంది అంధువల్ల ఆ దేశానికి మన దేశానికి కొన్ని రక్షణ పరమైన ఒప్పందాలు జరిగాయి దాంతో మాల్దీవులు తీర ప్రాంతం రక్షణ బాధ్యత మన దేశం నౌకాదళం తీసుకొని అక్కడ ఒక Indian Navy ను ఏర్పాటు చేసింది. 

 

8) ఖతార్ (Qatar)

      అరభ్ దేశాల్లో ఒకటైన ఖతార్ విలువైన పెద్ద పెద్ద భవనాల ఉత్పత్తిలో ఎంతో పేరుగాంచింది. ఇప్పటికీ ఆ దేశానికి వచ్చే ఆదాయంలో సింఘ భాగం ముడి చమురు ఎగుమతుల ద్వారనే వస్తుందని నిపుణులు చెప్తున్నారు. అటువంటి దేశంతో మన దేశం 2008వ సంవత్సరంలో రక్షణ సహకారం మరియు భద్రత మరియు చట్ట అమలు అనే ఒప్పందాలు పై సంతకం చేసింది అంధులో భాగంగా ఖతార్ తీర ప్రాంతాలకు రక్షణ కోసం అక్కడ భారత దేశం ఒక Indian Navy Base ను స్థాపించి ఆ దేశాన్ని పలు విదేశీ శక్తుల నుంచి సముద్ర దొంగల నుంచి కాపాడుతుంది. 

 

7) ఒమన్ (Oman)

       ముడి చమురిని ఉత్పత్తి చేసే గల్ఫ్ దేశాల్లో ఒకటిగా ఉన్నా ఒమన్ భారతదేశంతో ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. అంధులో భాగంగా మన భారతదేశంతో ఎన్నో విషయాల్లో ఒప్పందం కుదుర్చుకున్న ఒమన్ 2008లో కొన్ని రక్షణ ఒప్పందాలు పై సంతకాలు చేసింది దాంతో భారతదేశం గల్ఫ్ దేశాల్లో అధికారిక రక్షణ సంబంధం ఏర్పరుచుకున్నా మొట్ట మొదటి దేశాంగా ఒమన్ చోటు సంపాదించుకునింది. ఆ ఒప్పందాల ద్వారా భారత నౌకాదళంకి ఒమన్ లోని పోర్టులపై హక్కులు కలిగి ఉన్నాయి. అంధువల్ల ఒమన్ రాజధాని మస్కట్ లో భారత Indian Navy Base ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆ దేశంలోని అన్నీ పోర్టులను నౌకాదళం కోసం వినియోగించుకోవచ్చు.

 

6) మడగాస్కర్ (Madagascar)

      హిందూ మహా సముద్రంలో జరుగుతున్న కార్యకలాపాలను నిశితంగా పరిశీలించి అక్కడ జరిగే ఆర్ధిక కార్యకలాపాలకు కానీ మన దేశం భద్రతకు కానీ ఏమైనా ముప్పు వాటిల్లుతుందంటే వాటిని నివారించడానికి భారత ప్రభుత్వం ఎంచుకున్న వ్యూహాత్మక ప్రదేశం మడగాస్కర్ ఆఫ్రికా ఖండానికి చాలా దగ్గరగా ఉండే పెద్ద ద్వీప దేశం అయిన మడగాస్కర్ తో మన దేశానికి ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయి వాటి ఆధారంగా ఆ దేశంతో చేసుకున్నా ఒప్పందాలలో భాగంగా అక్కడ భారత Navi Base ను ఏర్పాటు చేసింది. ఆ స్థావరంలో ఉండే అత్యాధునిక రేడర్ మరియు నిఘా గేర్ల సాయంతో మన నౌకాదళం హిందూ మహా సముద్రాన్ని గస్తీ కాస్తు ఉంటుంది. 

 

5) సికెలిస్ (Seychelles)

       హిందూ మహా సముద్రంలో ఉన్నా నూట పదిహేను చిన్న చిన్న ద్వీపాల సమూహం కలిపి ఏర్పడే దేశమే ఈ సికెలిస్. ఇది కూడా ఆఫ్రికా ఖండానికి చాలా దగ్గర ఉన్నా ద్వీప దేశాల్లో ఒకటి. సికెలిస్ దగ్గర ఉన్నా చారలలో సముద్ర దొంగల బెడద ఎక్కువుగా ఉండడంతో అటుగా వచ్చే వ్యాపార నౌకలను మరియు ఆ దేశాన్ని రక్షించడానికి భారత ప్రభుత్వం అక్కడ ఒక Navy Base ను ఏర్పాటు చేసింది. కొనేళ్ళ క్రితం సికెలిస్ తో భారతదేశానికి కుదిరిన రక్షణ ఒప్పందం వల్ల అక్కడి సముద్రం జలాలు దాదాపు మన Indian navy చేతుల్లోకి వచ్చినట్లు నిపుణులు చెప్తున్నారు. 


 

 4) తజికిస్తాన్ (Tajikistan)

        గత కొన్ని ఏళ్లుగా భారత దేశం చుట్టూ ఉన్న దేశాల్లో చైనా ఊహాత్మకంగా తన Military bases ను ఏర్పాటు చేసి మన దేశాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుందని నిపుణులు చెప్తున్నారు. చైనా దేశ వ్యూహాలకు సమర్దవంతమైన ప్రతి వ్యూహాలను సిద్దం చేసుకోవడంలో దిట్ట అయిన మన దేశ మేధావులు అంధులో భాగంగా తజికిస్తాన్ లో కొన్ని రక్షణ ఒప్పందాలను కుదుర్చుకునేలా చేశారు. ఆ రక్షణ ఒప్పందం ప్రకారం తజికిస్తాన్ లో ఫర్ఖోర్ నగరానికి దగ్గరలో Indian Air force తన తొలి విదేశీ వాయుమార్గాలను ఏర్పాటు చేసుకుంది. ఆ స్థావరం ద్వారా ఇటు పాకిస్తాన్ అటు చైనా దేశాల సైనికుల కదలిక పై నిఘా వేయడమే కాకుండా అత్యవసర సమయాల్లో దాడులు కూడా చేయగలదు. తజికిస్తాన్ ప్రభుత్వం సైన్యం లోనికి ఎంచుకునే ఆ దేశ యువతకి మన దేశ సైనికుల ద్వారా శిక్షణ ఇప్పించటం కూడా ఆ రక్షణ ఒప్పందాల్లో ఒక భాగమని నిపుణులు చెప్తున్నారు.  

 

3) వియత్నాం (Vietnam)

       మన దేశంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న దేశాల్లో వియత్నాం ముందు వరసులో ఉంటుంది. ఒకప్పుడు అమెరికా లాంటి పెద్ద దేశంతోనే సుదీర్ఘమైన యుద్దం చేసి నెగ్గిన ఈ చిన్న దేశ సైన్యానికి మన దేశ సైన్యానికి చాలా సానిహిత్యం ఉందని నిపుణులు చెప్తుంటారు. ఆ మైత్రి వల్లనే కొన్నెల క్రితం దక్షిణ చైనా సముద్రంలో భారత నౌకాదళానికి చోటు కల్పించింది. వియత్నాంలో ఉన్నా కామ్ రాన్ బే దక్షిణ చైనా సముద్రానికి అతి దగ్గరలోనే ఉండడంతో అక్కడ Indian Navy మరియు Airways ను నిర్మించుకోవటానికి అనుమతి ఇచ్చింది దాంతో మన దేశం చైనా వ్యెవహారాలను మరింత పరిశీలిచటానికి విలైందని నిపుణులు చెప్తుంటారు.

 

2) భూటాన్ (Bhutan)

       మన ఈశాన్య భారతదేశానికి చైనా ఆక్రమిత టిబెట్ కి మద్యలో ఉన్నా ఎత్తైన పర్వత దేశం భూటాన్. ఆ దేశంతో భారతదేశానికి ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి ఈ చిన్న దేశానికి చైనాతో ముప్పు పొంచి ఉనందున కొన్నెల క్రితం భూటాన్ మన దేశంతో కొన్ని రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది అంధులో భాగంగా భూటాన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్నా పరో అనే నగరంలో భారతదేశం ఒక శాశ్వత Military base ని ఏర్పాటు చేసుకొని చైనా పై నిఘా పెట్టడమే కాకుండా ఆ దేశ రక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తుంది.

 

1) నేపాల్ (Nepal)

      మన దేశంతో సుధీర్ఘమైన సరిహద్దును కలిగున్న దేశాల్లో నేపాల్ కూడా ఒకటి. ఒకప్పుడు అఖండ భారతదేశంలో ఒకటిగా ఉన్న ఆ దేశం 1816లో బ్రిటిష్ ప్రభుత్వం విభజించు పాలించు అనే నినాదంతో మన దేశం నుంచి విడగొట్టి ఓ కొత్త దేశంగా అవతరించింది అయినా కొన్ని యుగాలుగా నేపాల్ తో మన బంధం కేవలం ఒక రాజకీయంగానే కాకుండా సామాజిక ఆద్యాత్మిక సాంస్కృతిక వానిద్య బంధాలు నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ హిమాలయ దేశంతో భారతదేశానికి ఉన్న మైత్రి వల్ల మన ప్రభుత్వాలు ఎన్నో విషయాల్లో ఆ దేశానికి సహాయ సహకారాలు అందించింది అంధువల్ల అక్కడ మన దేశ Military base ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకానొక సందర్బంలో నేపాల్ పై ఎవరైనా దాడి చేస్తే అది భారత్ పై దాడి చేసినట్లుగానే పరిగణించబడుతుందని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిందికూడా. ఈ ఒక్క మాటతోనే అర్ధం చేసుకోవచ్చు మన దేశానికి నేపాల్ తో ఉన్న బంధం ఏమిటో.

Post a Comment

0 Comments