ఎడారుల్లో నివసించే ప్రమాదకరమైన 6 జీవులు -Telugu Facts

     ఎడారి అంటే ఎలా ఉంటుంది తాగడానికి నీరు గాని తినడానికి ఆహారంగాని సరిగ్గా దోరకనివంటి ఒక భయంకరమైన ప్రదేశం. ఇలాంటి ప్రదేశాల్లో మనుషులు తమ మనుగడ సాగించడం అసాధ్యం కానీ కొన్ని జంతువులు అలాంటి భయంకరమైన ప్రదేశాల్లో కూడా జీవించగలవు కానీ ఆ జీవులు మనుషులకు ప్రమాధాకరమైనవిగా చెప్తారు. ఈరోజు మనం అలాంటి జంతువుల గురించి తెలుసుకుందాం.

 

1) గిలా మాన్-స్టర్

6 Most Dangerous Desert Animals In The World
Gila Monster

     ఈ జీవి పేరులోనే మాన్ స్టర్ అని ఉంది అంటే మీరే అర్ధం చేసుకోండీ అప్పుడు ఇది ప్రమాదకరమైనదో. ఈ గిలా మాన్ స్టర్ అనేది ఆరిజోనా మరియు మెక్సికోలో దొరికే సరీసృపాలు. ఇది యు.ఎస్ లో దొరికే ఒకేఒక్క విషపూరితమైన బల్లి జాతి దీని పొడవు మామూలు రెండు అడుగుల వరకు ఉంటుంది. ఇది నేల మీద చాలా నెమ్మదిగా నడుస్తుంది అలాగే ఇది మాంసాహారి కూడా ఇది ఎరను కనిపెట్టడానికి తన నాలుకను ముక్కును ఉపయోగిస్తుంది ఇది ఎక్కువ దూరం చూడలేదు అంధుకే తన నాలుకను ఉపయోగించి చుట్టూ ఉన్న ప్రదేశాలను పరిశీలించగలుగుతుంది. అయితే ఇది విషపూరితమైనది అని చెప్పుకున్నాం కధా దీని విషం మనిషిని చంపే అంత బలంగా ఏమి ఉండదు కానీ ఇది కొరికితే మాత్రం చాలా నొప్పిని కలిగిస్తుంది. ఇళ్ల చుట్టూ పక్కల ఇది కనిపిస్తే వెంటనే చంపేస్తుంటారు అందువల్లే వీటి సంక్య అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంతకు ఇది కరిస్తే ఎంత నొప్పి పుడుతుంది అంటే ఇది పాములాగా కాటు వేసి విషాన్ని శరీరంలోనికి పంపించదు ముందు గట్టిగా కరిచి తలను అటు ఇటు ఊపటం వల్ల కరిచిన చోట గాయం చాలా లోతుగా అవుతుంది అంధువల్ల ఇది కరిస్తే చాలా నొప్పిగా ఉంటుంది. కరిచినప్పుడు దంతాల్లో ఉన్న విషం శరీరంలోనికి వెళ్తుంది ఆ విషం వల్ల అధిక రక్త పోటు, వాంతులు, బలహీనత మరియు అవస్మారకాస్థితిలోకి వెళ్లిప్తారు కానీ చికిత్స చేస్తే మాత్రం ఆ మనిషి వెంటనే కోలుకుంటారు అంధువల్ల ఇది కరిచి ఇంత వరకు ఏ మనిషి కూడా చనిపోలేదు.

 

2) హర్నెడ్ డెసర్ట్ వైపర్

6 Most Dangerous Desert Animals In The World
Horned Desert Viper

     ఈ జీవి ఎడారిలో నివసించే అత్యంత ప్రమాధాకరమైన జీవి ఉత్తర ఆఫ్రికాలోని ఎడారిలో ఇవి కనిపిస్తాయి ఈ పాము యొక్క పొడవు పన్నెడు నుంచి పద్నాలుగు అంగుళాలు వరకు ఉంటుంది గరిష్టంగా ముప్పై మూడు అంగుళాల వరకు ఉంటుంది. ఈ పాముల్లో మగవాటికన్న అడవి పొడవుగా ఉంటాయి ఈ పాము యొక్క కళ్ల పైన కొమ్ములు వంటి ఆకారాలు రెండు ఉంటాయి అవి పాము యొక్క కళ్లని రక్షించడానికి దోహదం చేస్తాయి. ఈ పాములు మిగతా పాముల కన్నా చాలా బిన్నంగా కనిపిస్తాయి. ఈ పాము తనని తాను రక్షించుకోవడానికి ఇసుకలో ధాక్కుంటాయి అలానే తన తలను మాత్రమే కనిపిచేలా పెడుతుంది. ఈ పాములు గోధుమ, బూడిద, ఎరుపు మరియు పసుపు రంగులలో ఉంటాయి. నిజానికి ఈ పాము విషపూరితమైనదే కానీ మిగతా పాముల యొక్క విషంతో పోల్చుకుంటే ఈ పాము విషం చాలా బలహీనంగా ఉంటుంది. ఈ పాము కరిచినప్పుడు మనిషి ప్రాణం అయితే పోదు కానీ ఎన్నో సమస్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది ఇది కరిచిన చోట వాపు వచ్చి రక్త స్రావం జరుగుతుంది రక్తం అయితే గడ్డ కట్టదు ఇక మనిషికి కడుపునొప్పి, వాంతులు, ఒళ్ళంతా చమటలు పట్టడం ఇలాంటి సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది అంతే కాకుండా మూత్రపిండ వైఫల్యం సమస్యని కూడా ఎదురుకోవాల్సి ఉంటుంది.

 

3) కుగర్

6 Most Dangerous Desert Animals In The World
Cougar

     దీనిని మౌంట్ సింహం పుమా చిరుతపులి కేటామౌంట్ అనే పేర్లతో పిలుస్తారు ఇది పులులు సింహాలు గర్జించినట్లు గర్జించలేదు. ఈ కుగర్ ముక్యంగా ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలో దొరుకుతుంది. ఇది ఎక్కువుగా అడవి ప్రాంతాలు ఎక్కువ గడ్డి ఉండే నేల మీద, కొండ ప్రాంతాలు అంతేకాకుండా ఎడారి ప్రదేశాల్లో కూడా ఉంటుంది. మగ కుగర్ యొక్క పొడవు రెండున్నార మీటర్లు అలాగే ఆడ కుగర్ యొక్క పొడవు రెండు మీటర్ల వరకు ఉంటుంది వీటి బరువు అయితే వంద కేజీల వరకు ఉంటుంది. ఇది తనకన్నా చిన్న జంతువులు అయిన జింకలను రక్కున్లను పందికొక్కులను ఇలాంటి వాటిని వేటాడి చంపి తింటుంది. మామూలుగా ఈ కుగర్లు మనుషుల నుంచి దూరంగానే ఉంటాయి కానీ వీటిని మానుషలకి హానికరమైన జంతువులుగా పిలుస్తుంటారు. కొని సందర్భాల్లో మనుషులను చూసి బయపడినప్పుడు వీటికి కోపం వస్తుంది అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇవి మనుషుల పై దాడి చేస్తాయి. ఉత్తర అమెరికాలో చూసుకుంటే గత వంద సంవత్సరాల్లో కేవలం నూట ఇరవై ఐదు దాడులు మాత్రమే మనుషుల పై జరిగింది దాంట్లో ఇరవై ఏడు మంది మాత్రమే చనిపోయారు. ఇవి దాక్కోవడంలో కూడా మంచి అనుభవం కలిగినవి ఇవి తనంతట తాము ఎవరి ముందుకైనా వస్తే తప్ప ఇవి మాత్రం ఎవరికి కనిపించవు. ఒకవేళ ఈ కుగర్ దేనినైనా పట్టుకుంటే విడిపించుకోవడం చాలా కష్టం ఇది గంటకు ఎనబై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు అంధువల్ల ఏ జంతువు కూడా దీని నుంచి తపించుకోలేవు. ఇవి ఎంతటి ఎత్తైన చెట్టునైనా ఎక్కగలవు కేవలం సంభోగం కాలంలో తప్ప మిగిలిన సమయంలో అంత ఇవి ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతుంది ఇంక వేటాడటం కూడా ఒంటరిగానే వేటాడుతుంది.

 

4) ఆస్ట్రిచ్

6 Most Dangerous Desert Animals In The World
Ostrich 

     మామూలుగా ఎడారిలో నివసించే భయంకరమైన జంతువుల గురించి ఆలోచిస్తే ఆస్ట్రిచ్ మాత్రం మనకు తట్టదు. మనం అనుకునట్లుగా ఈ ఆస్ట్రిచ్ ఏమి అంత సాధు జంతువు కాదు ముక్యంగా ఇవి మనకు ఆఫ్రికాలో ఎక్కువుగా కనిపిస్తాయి అంతేకాకుండా ఇవి ఎడారి ప్రదేశంలో కూడా ఉండగలవు. ఉత్తర ఆఫ్రికన్ ఆస్ట్రిచ్ ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి అన్నది మన అందరికీ తెలిసిన విషయమే. ఒక ఆస్ట్రిచ్ యొక్క పొడవు 2.9మీటర్లు అంటే తొమ్మిది అడుగుల ఎత్తు వరకు ఉంటుంది ఇక దీని బరువైతే నూటయాబై కేజీల వరకు ఉంటుంది. మనం దీన్ని చేస్తేనే అంచనా వేయచ్చు ఇది ఎంత బలమైన పక్షో అని దాని కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి ఒక్క అడుగు పది నుంచి పదహారు అడుగుల దూరం వరకు వెయ్యగలదు. ఈ ఆస్ట్రిచ్ పక్షులు మనుషులను చుట్టూ ముట్టి దాడి కూడా చెయ్యగలవు అంతేకాకుండా ఆస్ట్రిచ్ గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు అంధువల్ల ఆస్ట్రిచ్ రెండు కాళ్ళు కలిగినటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద వేగవంతమైన పక్షిగా పేరు పొందింది. ఇక ఆస్ట్రిచ్ యొక్క కిక్ ఎంత బలంగా ఉంటుంది అంటే పులులు సింహాలు సైతం దాని దెబ్బకు చావాల్సిందే. ఇది రెండువేల పి.ఎస్.ఐ శక్తితో కిక్ చెయ్యగలదు అదే సింహం కొరికే శక్తి అయితే ఆరు వందల యాబై పి.ఎస్.ఐ ఉంటుంది అదే పులి కొరికే శక్తి అయితే వెయ్యి యాబై పి.ఎస్.ఐ ఉంటుంది అలాంటప్పుడు ఒక ఆస్ట్రిచ్ మనిషి పై దాడి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆస్ట్రిచ్ మనిషిలా పైన దాడి చెయ్యడం చాలా అరుదు ఒక వేల ఆస్ట్రిచ్ విసిగిపోయింది అనుకోండి అప్పుడు మాత్రమే మనుషుల పైన దాడి చేస్తుంది మిగిలిన సందర్భాల్లో అసలు దాడి చెయ్యవు.

 

5) వెస్టర్న్ డైమండ్ బ్యాక్ రాట్టెల్ స్నేక్

6 Most Dangerous Desert Animals In The World
Western Diamondback Rattlesnake

     దీనిని టెక్సాస్ డైమండ్ బ్యాక్ రాట్టెల్ స్నేక్ అని కూడా అంటారు ఇది యు.ఎస్ మరియు మెక్సికోలో దొరికేటివంటి ఒక రాట్టెల్ స్నేక్ జాతి. ఇది ఎక్కువుగా గడ్డి ఉన్న ప్రదేశాలు మరియు రాతి నేలలుతో నిండిన కొండ ప్రదేశాల్లో ఉంటుంది అంతేకాకుండా ఎడారి ప్రదేశాల్లో ఉంటుంది అందువల్ల ఈ ప్రదేశాలకి వెళ్లినప్పుడు ప్రతి అడుగు జాగ్రతగా వేయాల్సి ఉంటుంది. అదృష్టవసాతు దీన్ని గుర్తించడం చాలా సులభం. ఈ పాములు బూడిద గోధుమ రంగులలో ఉంటుంది అలానే శరీరంపై తెల్లటి చారలు కలిగుంటుంది దీనికి ఉన్న గిలక్కాయల వల్ల సులభంగా గుర్తుపట్టేయచు అది చేసే శబ్ధం చాలా చక్కగా వినిపిస్తుంది. ఈ పాము తన రాటేల్ని సెకనుకు ఎనబై సార్లు అటు ఇటు ఊపగలదు ఈ పాముల యొక్క పొడవు ఐదు అడుగుల వరకు ఉంటుంది మగవాటి పొడవు ఆడవాటి కన్నా ఎక్కువుగా ఉంటుంది. ఇవి ఎలుకులను కుందేళ్ళను పక్షులను బల్లులను ఇలా చిన్న చిన్న జంతువులను ఇది వేటాడి చంపి తింటుంది. మాములుగా ఈ పాము మనుషులకు దూరంగాగానే ఉంటాయి దాని అర్ధం ఈ పాము మనుషుల్ని కాటు వెయ్యదు అని కాదు ఈ గిలక్కాయల పాము చాలా విషపూరితంగా ఉంటాయి దీని విషం మిగిలిన పాముల విషంకన్నా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇది ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో విషాన్ని విడుదల చెయ్యగలదు మాములుగా ఒక కాటులో రెండు వందల యాబై మిల్లీ గ్రాముల వరకు విషాన్ని విడుదల చెయ్యగలదు ఒక వేళ అవసరం పడితే ఎనిమిది వందల మిల్లీ గ్రాముల విషాన్నికూడా  విడుదల చెయ్యగలదు. ఈ పాము కరిచినప్పుడు కనుక వెంటనే చికిత్స అంధించకపోతే మనిషి ప్రాణాలకు చాలా ప్రమాదం. ఒక పరిశోధన ప్రకారం తెలిసింది ఏంటంటే యు.ఎస్ లో పాము కాటు వల్ల చనిపోయినవారిలో ఎక్కువ శాతం ఈ వెస్టర్న్ డైమండ్ బ్యాక్ రాట్టెల్ పాముల వల్లనే చనిపోయారంట.

 

6) మంగూస్

6 Most Dangerous Desert Animals In The World
Mongoose

     మంగూస్ అంటే ముంగిసలు ప్రధానంగా ఇవి ఆఫ్రికాలో కనిపిస్తాయి వీటిలో కొన్ని జాతులు దక్షిణ ఆసియా యూరోప్లో కూడా ఉన్నాయి మన భారతదేశంలో ఉన్నవి అయితే బూడిద రంగులో ఉంటాయి. ఈ చిన్న జీవి యొక్క పొడవు తోకని తీసేస్తే ఇరవై నాలుగు నుంచి యాబై ఎనిమిది సెంటీమీటర్ల వరకు ఉంటాయి మరియు వీటి బరువు అయితే ఐదు కేజీల వరకు ఉంటాయి. ఇవి ఎవరితోనైనా ఎంతపెద్ద జంతువుతోనైనా భయంలేకుండా తలపడతాయి. చాలామంది అనుకుంటారు పాము ముంగిసను కరిస్తే ముంగిసకు ఎంకాదు విషం ఎక్కదు పాము కరిచాక ముంగిస ఏదో మొక్కనో ఆకునో తినేస్తుంది అంధుకే దానికి ఏమికాదు అని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు ఎందుకంటే ముంగిసలకి ఉండే ఎసిటైల్కొలిన్ రిసెప్టర్ల వల్ల ఈ పాముల విషం వాటిమీద కొంతవరకు ప్రమాదం చూపించదు అదే ఎక్కువ సార్లు కరిస్తే ముంగిస కూడా చనిపోతుంది కానీ పాములు కరవడానికి ముంగిస అవకాశం ఇవ్వదు తపించుకుంటూనే పాము మీద దాడి చేస్తుంది. ఈ ముంగిసలు న్యూరోటాక్సిక్ విషాన్ని అయితే కొంత వరకు తట్టుకుంటుంది. ఈ న్యూరోటాక్సిక్ నాగుపాములకి మంబాలకి మరియు క్రైట్ పాముల వంటి వాటిలో ఉంటుంది అదే హెమోటాక్సిక్ కలిగిన వైపర్లు రాట్టెల్ పాముల వంటి విషాన్ని తట్టుకోలేవు చిన్న గాయం కూడా ప్రాణాంతకరంగా మారుతుంది. ఇవి మనుషుల పట్ల అంతగా దూకుడుగా ఏమి ఉండదు ఒకవేళ కరిచినట్లైతే స్ట్రెప్టోకోకల్ సెప్సిస్ అనే వ్యాది వస్తుంది. ఇది ఎలాంటి వ్యాది అంటే రక్తం ద్వారా అన్నీ శరీర అవయవాలకు వ్యాపిస్తుంది వెంటనే కనుక చికిత్స చేయించకపోతే మనిషి చనిపోయే ప్రమాదముంది. ఈ ఎడారి ప్రదేశాల్లో ఎవరినైనా ముంగిస కరిస్తే చికిత్స ఇపించటం చాలా కష్టమే.

Post a Comment

0 Comments