ఈ TOP 5 దేశాల్లోని పిల్లలు school కి వెళ్లడానికి మృత్యువుతో పోరాడుతారు -Telugu Facts

ప్రపంచంలో ఏ దేశం భవిష్యత్తు అయిన ఆ దేశ బావిపౌర చేతులోనే ఉంటుందని మేధావులు చెప్తుంటారు. అంధువల్ల పిల్లల్ని సమాజనికి ఉపయోగపడే విదంగా తీర్చిదిద్దడం కోసం వారిని విద్యావంతులను చెయ్యడం ఎంతో ముక్యం. బాగా చదువుకోవడం వల్ల వారి భవిష్యత్తు కుటుంబ స్థితిగతులు కూడా మెరుగౌతాయని పిల్లలు కన్నా తల్లితండ్రులు ఎక్కువుగా ఆలోచిస్తారు దాంతో మంచి పాటశాలలు ఎంత దూరంలో ఉన్నా బస్సులోనో కారులోనో లేదా పలురకాల రవాణా వాహనలోనో పిల్లల్ను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తున్నారు తల్లితండ్రులు. కొన్ని దేశాల్లో ఉండే కొంతమంది పిల్లలు మాత్రం తమ బంగారు భవిష్యత్తు కోసం ప్రతిరోజూ వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఆ దేశాల్లో ఉండే కొన్ని పాఠశాలకు వెళ్ళే మార్గాలు ఏమపూరికి మార్గాలులా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అక్కడి పిల్లలు పాఠశాల చదువుల కోసం ప్రాణాంతక దారుల్లో ఎంధుకు ప్రయాణిస్తున్నారు ఇంతకీ ఈ పరిస్థితులు నెల్లకొన్న టాప్ 5 దేశాలు ఎక్కడ ఉన్నాయనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

5) చైనా

Most Dangerous Ways To School
China

     సాధారణంగా పేదరికం సరైన సదుపాయాలు లేని ప్రదేశాలు ఎక్కువుగా బీద దేశాలతో పాటు ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న దేశాల్లో కూడా కనిపిస్తాయి కానీ ఇలాంటి పరిస్థితులు చైనాలాంటి బాగా అభివృద్ది చెందిన దేశాల్లో కూడా కనిపించడం నిజంగా ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నేడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్టల్లో రెండో స్థానాన్ని ఆక్రమించుకొని మరికొన్ని ఏళ్లలో అమెరికాను సైతం వెనక్కు నెట్టి ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించాలని తహతహలాడే చైనాలో మాత్రం నేటికీ పేదరికంలో మగ్గే ప్రజలు కనీస వసతులులేని గ్రామాల శాతం ఎక్కువుగా ఉందని నిపుణులు చెప్తున్నారు. అంధుకు నిదర్శనంగా ఆ దేశంలో సిచువన్ చైనీస్ ప్రావిన్స్లో అటులర్ అనే మారుమూల గ్రామం నిలుస్తుంది. ఆ ప్రదేశంలో ఉండే ఎత్తైన కొండల పైన నివాసం ఉంటున్న అటులర్ గ్రామానికి నేటికీ సరైన రోడ్డు మార్గాన్ని చైనా ప్రభుత్వం నిర్మించలేదు దాంతో ఆ గ్రామంలో ఉండే పిల్లలు అక్కడి కొండల కింద ఊరిలో ఉండే పాఠశాలకు వెళ్లిరవడానికి ప్రతిరోజూ ప్రాణాలను పణంగా  పెడుతున్నారు. అటులర్ గ్రామంతో పాటు అక్కడి కొండపై ఉండే మరికొన్ని గ్రామాల ప్రజలు కింద ఉన్న పట్నంకి వెళ్లడానికి కనీసం మట్టి రోడ్డు కూడా లేకపోవడంతో వెదురుకొమ్మలతో చేసిన నిచ్చెనల సహాయంతో కిందకు దిగుతూ మాద్యమద్యలో కేవలం అడుగు నుంచి రెండు అడుగుల వెడల్పు మాత్రమే ఉండే సన్నని అంచుల వెంబడి నడుస్తూ తమ ప్రయాణాన్ని సాగిస్తారు దాంతో పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కోసం పాఠశాలకు వెళ్లడానికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు.

 

4) నేపాల్

Most Dangerous Ways To School
Nepal

     మన దేశానికి ఉత్తరాన ఎత్తైన మంచుకొండలకు ఆవల ఉన్న ఓ చిన్న దేశం నేపాల్. ఆ దేశం మన దేశానికి కేవలం ఓ సరిహద్దు దేశంగానే కాకుండా సంస్కృతిక ఆర్ధిక అంశాలలో కొన్ని యుగాలుగా విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకొనుంది. అసలు ఒక విదంగా చెప్పాలంటే ఒకప్పటి అఖండ భారతావనిలో నేపాల్ కూడా బాగంగానే ఉండేది. బ్రిటిష్ వారు నేపాల్ని మన దేశం నుంచి వేరు చేసి ఒక ప్రత్యేకదేశంగా గుర్తించడంతో అప్పటి నుంచి నేపాల్ ఓ ప్రత్యేక దేశంగా పరిగినించబడుతుంది. ఒక రకంగా భారతదేశం కంటే ముందే స్వతంత్రాన్ని సంపాదించుకున్న నేపాల్ ఆర్ధిక వ్యవస్తా నేటికీ అంతంత మాత్రంగానే ఉండడంతో ఆ దేశంలో కనీస వసతులులేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి అటువంటివాటిలో కాన్పూర్ అనే గ్రామం కూడా ఒకటి. నేపాల్ మధ్యబాగంలోని బాగ్మతి ప్రావిన్స్ లోగల కభ్రేపాలంచోక్ అనే జిల్లాలో దాదాపు సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉన్న కొండలపై కాన్పూర్ అనే గ్రామం ఉంది. సాధారణంగా పేద ప్రజలు ఎక్కువుగా ఉండే ఆ ప్రాంతంలో అధిక శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా పండించిన పంటలు అమ్ముకోవడానికి దగ్గరలో ఉన్న నగరానికి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న నగరానికి మద్యలో ప్రపంచలో అత్యంత ప్రమాదకరమైన నదుల్లో ఒకటైన త్రిశూలి నది ప్రవహిస్తుంది దాంతో కాన్పూర్ గ్రామంతో పాటు దాని దగ్గరలో ఉన్న ఇతర గ్రామ ప్రజలు ఆ నదిని దాటి దగ్గరలో ఉన్న నగరానికి వెళ్లాలంటే దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా వంతెన వరకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఇంత దూరం ప్రయాణించి పాఠశాలకు వెళ్ళిరావాలి అంటే చాలకష్టం అవటంతో త్రిశూలి నదిని దాటి దాని పక్కనే ఉన్నా రహదారిని ఎక్కడానికి ఆ నదికి ఇరువైపులా ఓ ఇనుప తాడుని కట్టి దానికి ఒక తొట్టిని తగిలించి దాని సహాయంతో త్రిశూలి నదిని దాటుతున్నారు. ఎప్పుడో గ్రామస్తుల చొరవుతో నిర్మించుకున్న ఆ నిర్మాణం నేడు పూర్తిగా తుప్పుపట్టి ఉన్నా ఇంకా దాని సహాయంతోనే అరవై మీటర్ల వెడల్పు ఉన్నా త్రిశూల నదిని అక్కడి పాఠశాల పిల్లలు దాటుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఎంతో ఉదృతంగా ప్రవహించే త్రిశూల నది దాటే సమయంలో ఎవరైనా కాలుజారి అంధులో పడినా ఒకవేళ ఆ ఇనుప తడులు ఉన్నట్లుండి తెగిపోయినా బంగారు భవిష్యటు ఉన్న పిల్లల ప్రాణాలు పోతాయని కాన్పూర్ గ్రామస్తులు నేటికీ బయపడుతున్నారు.

 

3) భారతదేశం 

Most Dangerous Ways To School
India

     మన దేశంలో ఎత్తైన హిమసికరాలు ఉన్న ప్రాంతంగా లడఖ్ కి ఓ ప్రత్యేకమైన గుర్తిపు ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్లో ఒక బాగంగా ప్రత్యేకప్రతిపత్తిగల ప్రాంతంగా ఉన్నా లడఖ్ లో అభివృద్ది అత్యంత దారుణంగా ఉంది అంటూ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి ఉన్నా ప్రత్యేకమైన ప్రతిపత్తిని మన దేశం కేంద్ర ప్రభుత్వం తీసి వెయ్యడంతో లడఖ్ లోని పరిస్థితులు నేడు ప్రపంచానికి తెలుస్తునాయి అటువంటివాటిలో జాంగ్లా అనే గ్రామంలోని పిల్లలు పడుతున్న బాధలు కూడా ఒకటని చెప్పవచ్చు. ఆ గ్రామం జన్స్కర్ లోయలోని హిమాసికరాలపై దాదాపు ఎనిమిది వేల మీటర్ల ఎత్తులో బాహ్యప్రపంచానికి పూర్తి దూరంగా ఉంటుంది అంధువల్ల ఆ గ్రామం దాదాపు రెండు నెలలు తప్ప మిగతా నెల్లలు అన్నీ మంచులో కప్పబడి ఉంటుంది దాంతో జాంగ్లా గ్రామంలోని పిల్లలు అంధరు పై చదువులు చదువుకోవాలంటే అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా లేహ్ నగరానికి వెళ్ళాల్సిందే అయితే జాంగ్లా నుంచి లేహ్ కి వెళ్లడానికి ఎటువంటి రోడ్డు మార్గం లేకపోవడంతో అక్కడి పిల్లలు ఆ మంచు పర్వతాల అంచులపై గడ్డగా అయిపోయిన నదులపై అత్యంత ప్రమాదకరమైన దారిలో దాదాపు ఎనిమిది నుంచి పది రోజులపాటు ప్రయాణించి లేహ్ లోని పాఠశాలకు చేరుకుంటారు. అలా వెళ్ళిన పిల్లలు ఆ పాఠశాలలోని విద్యార్థుల వసతి గృహంలో తొమిది నెలలు ఉండి మళ్ళీ వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత తమ స్వగ్రామానికి వచ్చీ రెండు నెలలు తల్లితండ్రులతో గడుపుతారని నిపుణులు చెప్తున్నారు. చదువుకుంటే మంచి భవిష్యత్తు లబిస్తుందనే ఒకేఒక్క ఆశతో జాంగ్లా గ్రామంలోని పిల్లలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు దూరమైన మార్గంలో ప్రయాణం సాగిస్తున్నారు.

 

2) ఇండోనేషియా

Most Dangerous Ways To School
Indonesia

     మన ఆసియా ఖండంలో అభివృద్ది చెందుతున్న దేశాలలో ఇండోనేషియా కూడా ఒకటని చెప్పవచ్చు. నేటికీ దాదాపు సగం మంది ప్రజలు ఇంకా పేదరికంలో ఉండడంవంటి పలు కారణాల చేత ఇండోనేషియాలోని అనేక గ్రామాలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉండిపోయాయి. ఆ విదంగా ఇండోనేషియాలో అభివృద్ది చెందని గ్రామాల్లో బటు బుస్సుక్ అనే గ్రామంకూడా ఒకటి ఆ దేశంలోని సుమత్రదీవులున్న ఈ మారుమూల గ్రామంలో ఎటువంటి పాఠశాలలు లేకపోవడంతో బటు బుస్సుక్ పిల్లలందరూ దాదాపు పన్నెడు కిలోమీటర్ల దూరంలో ఉన్నా పదాంగ్ అనే నగరానికి వెళ్తారు కానీ ఆ నగరానికి చేరుకోవడానికి ఎటువంటి రోడ్డు మార్గం లేకపోవడంతో బటు బుస్సుక్ లోని పిల్లలందరూ అటవి ప్రాంతంలో ప్రతిరోజూ కాలినడకన వెళ్లొస్తారని పరిశీలకులు చెప్తున్నారు. వారు వెళ్ళే దారిలో ఒక నది ప్రవహిస్తుంటుందని దాదాపు రెండు సంవత్సరాల క్రితం కురిసిన బారి వర్షాల కారణంగా ఆ నది పైన కట్టిన చెక్క వంతెన కూలిపోయింది దాంతో వంతెన కూలిపోగా మిగిలిన ఇనుప వైరులపై బటు బుస్సుక్ గ్రామ పిల్లలు ప్రతిరోజూ ఆ వైర్లపై నడుచుకుంటూ ఆ నదిని దాటల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. అత్యంత వేగంగా ప్రవహించే నదిపై ఎప్పుడు తెగిపోతాయో తెలియని స్థితిలో ఉన్నా తాడ్లను పట్టుకొని ప్రతిరోజూ అక్కడి పిల్లలు ఆ నదిని దాటుతుండడం చూసినవారికి గుండె ఆగినంతపని అవుతుందంట. భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందడానికి బటు బుస్సుక్ గ్రామంలోని పిల్లలు ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెట్టడం అక్కడి ప్రజల పరిస్థితిని తెలియచేస్తుందని పరిశీలకులు చెప్తున్నారు.

 

1) ఫిలిప్పీన్స్

Most Dangerous Ways To School
Philippines

     చదువువల్ల మంచి భవిష్యత్తు పొందడంతో పాటు తమ కుటుంబ ఆర్ధిక స్థితిగతులో కూడా ఎంతో మెరుగుపడుతుందనే బలమైన నమ్మకం. ఫిలిప్పీన్స్ లోగల కొంతమంది పిల్లలను ప్రతిరోజూ మృత్యువుతో పోరాడేలా చేస్తుంది. ఇంత భయంకరమైన పరిస్తితి ఫిలిప్పీన్స్ లోని ఏ మారుమూల ప్రదేశంలో కాకుండా ఆ దేశం రాజధానికి కూతవేటు దూరంలోనే నెలకొని ఉండటం అక్కడి దయనీయ స్థితిగతులను అంచనా వేయచ్చు అని నిపుణులు చెప్తున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరానికి పక్కనే ఉన్నా రిజాల్ ప్రావిన్స్ లోని కొన్ని మారుమూల గ్రామాల్లో సరైన పాఠశాల సాధుపాయలు లేవు దాంతో ఆయా గ్రామాల్లో చదువుకునే పిల్లలు ప్రతిరోజూ దాదాపు గంటపైన పక్కనే ఉన్నా నగరానికి ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ వారు వెళ్ళే దారిలో ఆ దేశంలోనే అతిపెద్ద నదుల్లో ఒకటైన కాగయన్ నది ప్రవహిస్తున్నా వారు ఆ నదిని తప్పక దాటాల్సిన పరిస్తితి. ఆ నదిపై ఎటువంటి వంతెనలు లేకపోవడంతో రిజాల్ ప్రావిన్స్ లోని గ్రామాల్లో ఉండే పిల్లలు పాత కారు లారీ టైర్లపై ఎక్కి నదిని ఒక పక్క నుంచి మరో పక్కకు దాటుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఎంతో వేగంగా ప్రవహించే కాగయన్ నదిలో చిన్న చిన్న పిల్లలు టైర్ల సహాయంతో దాటడం ఒక సాహసకార్యమనే చెప్పాలి. ఇలా ప్రతిరోజూ పాఠశాలకు వెళ్ళిరావడానికి దాదాపు మృత్యుముఖం వరకు వస్తున్న అక్కడి పిల్లలను చూస్తే ఎవరికైనా గుండె జల్లుమనకతప్పదు.

 

 

Post a Comment

0 Comments